ALL

దేవాలయాలలో దేముడు ఉంటాడా? దేవాలయంలోని విగ్రహంలో దేముడు వున్నాడని మనమందరము గుడికి వెళ్లి విగ్రహాన్ని మొక్కు తున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమంటే విగ్రహం రాతితో చేసిందే, అదే విధంగా గుడి మొత్తం రాతితో చేసిందే ఐతే విగ్రహం దేముడు ఎలా ఐయ్యాడు, గుడి మెట్లు దేముడు ఎందుకు కాలేదు.  ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం చెప్పలేక పోటంతో హిందువులకు మన ఆచారాలమీద, సాంప్రదాయాలమీద నమ్మకం సన్నగిల్లుతుంది.
ప్రతి దానిని కూలంకుషంగా పరిశీలిస్తే మనకు ప్రతి హిందూ విధానానికి సమాధానం తెలుస్తుంది.
మీకు ఈ విషయాన్నీ మీకు తెలిసిన ఉపమానంతోటే వివరిస్తాను.  ఈ రోజు మనందరికీ ఫోన్ అంటే తెలియనివారు లేరు, అంతే కాక ఫోన్ వాడనివారు లేరు. కాబట్టి మీకు ఫోనునె  ఉదాహరణగా తీసుకొని ఈ విషయాన్ని వివరిస్తాను.
మనం ఫోన్ చేసిన వారు పెద్దవారు ఐతే ఫోనులో గౌరవంగా నమస్కారం చేసి వినయంగా మాట్లాడుతాము అదే చిన్న వాళ్ళు ఐతే ప్రేమతో మాట్లాడుతాము.  అలాగే మనం ఎవరితో మాట్లాడితే వారు మన ముందరవుంటే ఏరకంగా ప్రవత్తిస్తామో అలానే ప్రవర్తిస్తాము.  నిజానికి మనం మాట్లాడేది ఫోనుతో కాని  అవతలి వ్యక్తితో కాదు.  ఈ విషయం మనందరికీ  తెలుసు. కానీ మనం మాట్లాడిన మాటలు అవతలి వాడు వింటున్నాడని మనకు నమ్మకం.  దానికి ప్రమాణం అవతలి వ్యక్తి నీతో ఫోనులో మాట్లాడటమే. నిజానికి నీ చేతిలో వున్న ఫోన్కి అవతలి వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ మీ ఇద్దరికీ ఫోన్ సంబంధాన్ని కలుపుతున్నది.  అంటే ఫోన్ ఒక సాధనగా మీ మధ్య వున్నది.  మీరు ఒకరికి ఒకరు ఎదురుపడితే ఫోన్లో మాట్లాడుకొనవసరం లేదు.  ఇప్పుడు ఫోన్ నిర్మాణాన్ని పరిశీలిద్దాం.  ఫోన్ ఒక ప్లాస్టిక్ పదార్ధంతో కొన్ని లోహపు తీగలతో మరియు  ఇతర ఎలక్ట్రానిక్ I.C.లతో నిర్మితమైనది.  నీ ఫోనులో వున్న వస్తువులు విడిగా బైట కూడా దొరుకుతాయి కానీ అవి విడివిడిగా ఫోన్ చేసే పని చేయలేవు.  ఆ విడిభాగాలను ఒక సర్క్యూట్ ప్రకారం అమర్చి షోల్డర్స్ చేసి నిర్మించితేనే ఫోన్ తయారు అవుతుంది.  అంతేకాదు ఫోనుకు ఒక సిం కార్డుకూడా ఉండాలి అప్పుడు అది పలుకుతుంది.  ఈ విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు మన హిందు దేవాలయాన్ని ఫోనుతో పోలుద్దాం. దేవాలయం ఒక ప్రత్యేక నిర్మాణం అది ఆగమశాస్త్ర విధానంలో నిర్మిస్తారు.  మానవులు నివసించే గృహాలకి దేవాలయ నిర్మాణానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. గర్భగుడి నిర్మాణం చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది.  ఈ నిర్మాణానికి గోపురం ప్రముఖమైనది.  గోపురం కొనికల్ ఆకారంలో వుంది చాలా ఎత్తుగా ఉంటుంది.  దాని మధ్య భాగంలో విగ్రహం ప్రతిష్టిస్తారు.  ఆ విగ్రహంపై ఆకాశంలోని కాస్మిక్ శక్తి పూర్తిగా గోపురంద్వారా ప్రసరించి కేంద్రీకరించబడుతుంది.  కాబట్టి ఎప్పుడైతే భక్తుడు ఆ విగ్రహాన్ని దర్శిస్తాడో విగ్రహంలో వున్న కాస్మిక్ ఎనర్జీ భక్తునిపై రిఫ్లెక్ట్ అవుతుంది.  దత్ ద్వారా భక్తునికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మన ఫోనులో ఉన్నట్లు సిం కార్డు దేవాలయంలోకూడా ఉంటుంది.  దీనినే యంత్రం అంటారు.  ఈ యంత్రం ఆగమశాస్త్ర రీత్యా స్వర్ణ, రజిత, తామ్ర ఫలకాలలో ఏదో ఒక ఫలకం మీద నిర్మించి విగ్రహ ప్రతిష్ట సమయంలో తగు విధంగా పూజించి విగ్రహం క్రింద ప్రతిష్టిస్తారు.  ఆ యంత్రం భక్తునికి భగవంతునికి మధ్య మీ ఫోను కనక్క్షన్ మాదిరి పనిచేస్తుంది.  భక్తుని కోరికలు భగవంతునికి చేరి ఈ విగ్రహం ద్వారా భక్తుని కోరికలు ఈడేరుతాయి. అందుకే భక్తులు అనేక వందల కిలోమీటర్ల దూరమునుండి వచ్చి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు.  ప్రసిద్ధ దేవాలయాలకు భక్తుల రద్దీ రోజు మనం చూస్తున్నాం.
పూజించటం ఎలా. షొడశోపచార పూజ అంటే ఏమిటి మళ్ళి ఇంకోసారి తెలుసుకుందాం.
సనాతన హిందూ ధర్మంలో పూర్వం ప్రజలు పెద్దవాళ్ళు చెప్పింది ఎదురు ప్రశ్న వేయకుండా అనుకరించేవారు.  అందుకే వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మన గ్రహచారం ఏమంటే చాలామంది హిందువులకు హిందూ ధర్మం మీద అవగాహన లేదు.  అది అటుంచి ఇతరులు హిందువులఫై దాడి చేయటానికి వాళ్ళకి తెలిసింది కొంత తెలియనిది కొంత పైత్యం కలిపి ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు.  అది అట్లా ఉంటే కొందరు హిందువులు నాస్తికులుగా మారి హిందూ ధర్మాన్నే ప్రశ్నిస్తున్నారు.  ఇది చాలా విచారించదగ్గ విషయం. అందుకే ప్రతి వారికి హిదు  సంప్రదాయాల విశిష్టత తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ రచనలు సాగిస్తున్నాను.  బుధ జనులు ఈ వివరణలను పరికించి, పరిశీలించి, చేసే సాద్ విమర్శలకు సాదర స్వగతం. వితండ వాదం చేసేవారి విమర్శలు నిషేధం.

__________________________________________________________________________________________________________________________________________________________________

కరోనోపాఖ్యానం  ఒక్క దినంబు  నైమిశారణ్యమందు  శవనకాది మహాఋషులు సూతుని సమీపించి ముచ్చటించు వేళ శవనకుడు లేచి నిలబడి కరములు జోడించి సూతినితో ఇట్లనెను.  ఓ మహర్షి తాము భూత భవిష్యత్ వర్తమానములెఱింగిన మహానుభావులు కాన మీరెరుగని విషయామీ పృద్వితలమున ఉండదు కాన నా యందు ప్రసన్నులై నా సందేహములు తీరుపవేడెదన్. అంత సూత మహర్షి, ఓ మహర్షి మీరు అడుగుటకు నా వద్ద సంసశయమెందులకు మీ బుద్ధికి పుట్టిన సంధేహములను నిస్సంశయముగా అడుగుడి అని ఆనతి నివ్వ అంత శవనకుడు వినమ్రుడై రాబోవు కలియుగంలో ఒకానొక శర్వారి  నామ సంవత్సరములో మానవాళికి తీవ్ర విపత్తు సంభవించు నట్లు నాకు జ్యోతకమౌచున్నది అది ఎంతవరకు యధార్ధము.  అట్లైన ఈ మానవాళిని కాపాడునదెవ్వరు తాము దయతో సెలవిండనెను. అంత మహర్షి దయాళుడై కరోనోపాఖ్యానంను  ఈ విధముగా చెప్పఁన్దోడంగెను. 

జంబూ ద్విపములో భారత వర్షంలో హిమనగానికి ఉత్తర ప్రదేశంలో చెనా అను ఒక రాష్ట్రము గలదు.  అందు బహు సుప్రసిద్ధ పట్టణములు గలవు.  అందులో యువన్ మను ఒక పట్టణము బహు విశాలముగా, అందముగా జనాకర్షణగా సాగర తీరమున గలదు.  ఆ పట్టణ వర్ణన చేయుట మానవ మాత్రుల వశము కాదు.  ఆ నగరిని దర్శించిన రాజులకు అక్కడి సౌధములను చూసుటకు శిరస్సులు పైకి ఎత్త ఆ సౌధాగ్రము ఫై దృష్టిపడ వారి మకుటములు క్రిందపడుచుండెను.  బహు అంతస్తులు, అత్యంత శోభాయమానమైన నిర్మాణములు, గాంచిన వారిని ముగ్దులను చేయుచుండెను.  సాగర తీరము బహు విశాలముగా ఉండి అత్యంత అధునాతన వనములు, భవనములు కలిగి చూపరుల మంత్రముగ్ధుల చేయుచుండెను.  అంతటి చక్కటి పట్టణము బహు జనములతో కిట కిట లాడుచుండెను. అచటికేగిన వారెవ్వరు ఆ నగరిని పొగడకనుండరు.  దేవేంద్రుడు సహితం అచటికి చనిన ఆహ ఈ పట్టణమెంత శోభాయమానంగా వున్నది నా ముఖ్య పట్టణమైన అమరావతిని ఆక్షేపించునట్లున్నదే అనక మానడు. అంతగా అభివృద్ధి చెందిన ఆ నగరిని గాంచిన వారెవ్వరైనా అచటి మానవులు సంస్కార వంతులు, ధర్మపరులు అని భావింపక తప్పదు.  కానీ అక్కడి ప్రజల జీవన విధానము తెలిసిన వారెవ్వరైనా, వారిని ఛీత్కరించక మానరు.  ఏలయన వారి ఆహారపు అలవాట్లు బహు చిత్రముగా మరియు హేయముగా తోచును.  వారు ఈ ధరాతలమున భుజించని జీవి లేదు అన అబ్బరపడనవసరము లేదు.  కప్పలు, పాములు, గబ్బిలములు, సకల జల చరులు, పక్షులు వారి కాహారమగు చుండెను శునకములను కుడా వారు వదలరు.  విశ్వమంతా పాములను చూసి భయపడ వారు ప్రీతితో శిరస్సు తప్ప శరీరమంతా తినుట ఇతర దేశస్తులకు ఆశ్చర్యం కలిగిస్తున్నది.  ప్రపంచమంతా పాముల భారం పడి ప్రాణముల నొడ్డుచుండ వారు ఆ విష సర్పములనే ఆహారరముగా తినుచున్నారన వారాలు ఎట్టి వారో తెలియగలరు. ఒక్క మాటలో చెప్ప వలెనన్న వారు ఈ పృద్విమీద తినని జీవి లేదనిన ఒప్పదగును. 

ఇట్లు ఆ జనులెల్ల జీవులను తమ ఇచ్చానుసారముగా భుజించుచుండ సర్వ జీవులకు ముప్పు వాటిల్లుతుండే . ఒక్కదినంబు భూచరములు, వాయుచరములు, ఉభయచరములు అచ్చటగల శివాద్రి అను ఒక పర్వతమందు చేరి ఈ మానవులనుండి వాటిని రక్షించుకొను మార్గాన్వేషణం చేయ బూనెను. 

సౌలొచ తపోదీక్ష పూనుట 

అట్లు ఆయా జీవులు తలకొక సూచనచేయుచు వాటి రక్షణ నిమిత్తము ప్రయత్నములు చేయగా ఏవియు సరైనవిగా వాటికి  తోచలేదు. అందులకు కారణమేమన ఈ జీవులు శారీరకంగా, బుద్ధికుశలతలోనూ అక్కడి జనుల కన్నా ఎంతో స్వల్పంగా తోచినవి.  కాన ఈ విషమ పరిస్థితికి విరుగుడు ఏమిటని అన్ని జీవులు మరల మరలా యోచించ సాగెను.  అంత  అక్కడ అంతవరకు మౌనంగా వున్న సౌలొచ అను  ఒక చర్మఛర్కము (గబ్బిలం) ఆ జీవ సమూహమును చేరి యిట్లనియె. నేను ఎన్నో ఇతిహాస కధలు తెలుసుకున్నాను.  గతంలో ఎట్టి ప్రమాదము వచ్చినను సర్వ లోకాలకు  పితయేన  ఆ మహాదేవుని కొల్చారని ఆ దేవదేవుని కృప వల్ల ఫలితం పొందారని మనకు తెలుస్తున్నది. దేవాది దేవుడు ఆర్త జన రక్షకుడు, దుష్టజన శిక్షకుడు, భోళా శంకరుడు, గతంలో గజ కోరిక మన్నించి గజాసురుని హృదయంలో కొలువున్నాడు, సాలె పురుగుకు కాలముకు హస్తికి వరములిచ్చి అచట శ్రీకాళేశ్వర రూపమున కొలువున్న ఆ దేముడు తప్ప మనలను కాపాడ అన్యులు లేరని.  కాన మనకు ఈ విషమ పరిస్థితిలో ఆ దేవదేవుని కొలుచుట కన్నా వేరు మార్గాంతరం లేదు అని నుడివి, నేను ఈ నాటినుండి ఆ దేవదేవుని శరణు చొచ్చి మన జీవహరులను నిర్జించు వరంబు పొందెదనని ఆ జీవులకు తెల్పి వాటిని ఊరడించి మీరు నాకు దేవుని వరప్రదానం లభించువరకు ఆ జనులనుండి మిమ్ము మీరు కాపాడుకొనుడని తెల్పి ఆ పర్వత శిఖరమందు గల ఒక బోధివృక్ష శాఖను చేరి తల్లక్రిందులుగా మహా దేవుని గూర్చి ఘోర తపంబుఆచరించే. . 
సౌలొచ తపోజ్వాలతో ఇంద్రలోకం భయకంపితులు కావటం : సౌలొచొనర్చు తీవ్ర తప్పస్సుతో జనించిన తపో జ్వాలలు ఇంతింతయి పెరిగి పెరిగి అవి ఇంద్రలోకాన్నిచుట్టూ ముట్టాయి.  ఆ జ్వాలా ప్రచులిత  తీవ్ర తాపానికి దేవాదులెల్లరు  అతలాకుతలమైరి.  దేవతలు, సప్తఋషులు, నవగ్రహాలు హాహా కారాలు చేస్తూ మహేంద్రుని కడకెళ్లి మొరలిడిరి.  అంత మహేంద్రుడు ఈ జ్వాలా ప్రకోపిత ఉష్ణ తాకిడిని ఎదుర్కొను మార్గము గాంచక ఖిన్నుడాయె.  అంత ముల్లోక సంచారగు బ్రహ్మర్షి నారద మహాముని వచ్చి మహేంద్రునిచేరి  ఇది భూలోకంలో మహా తపస్వి ఆచరించు తపో ప్రభావంబున జనించిన తీవ్రగ్నిగా తెలిపి వీటినేదుర్కొను శక్తి కేవలము ఆ మహా దేవునికి తప్ప అన్యులకు లేదు.  కాన ఆ మహాదేవుని శరణు చొచ్చుమని బోధించే.  వల్లే అని అంత దేవేంద్రుడు తన పరివార సమేతముగా కైలాసముకేగి పరమశివుని శరణు చొచ్చి ప్రభు మేము భూలోకతాపసి తీవ్ర తపోజ్వలోషణముతో భయ కంపితులమౌతున్నాము.  అవి ఇంద్రలోకమును ధ్వంసం చేయకమునుపే మమ్ము కాపాడమని కరములు జోడించిప్రార్ధించే.  సప్త ఋషులు, నవగ్రహాలు ఇతర దేవతలు భయకంపితులై పరమేశుని పాదాలపై పడిరి.  దయాళువైన పరమేశ్వరుడు ఆ జ్వాలల కారణమెఱుంగ అది శివాద్రి అను ఒక    చర్మఛర్కము (గబ్బిలం) చేయు తీవ్ర తప్పస్సు ప్రభావమని యెఱుంగే. అంత పరమేష్ఠి సహితముగా పరమేశ్వరుడు శివాద్రికరిగి ఆ చర్మఛర్కము (గబ్బిలం) నకు ప్రత్యక్షమై ఓ సౌలోచి నీ తపస్సుకి మెచ్చితి నీకెట్టి వరమ్ము కావలెను  కోరుకొమ్మనెను.  ఆ  సౌలొచ నేత్రానందముగా పరమేష్ఠి సహిత పరమేశ్వరుని గాంచి వేనోళ్ల ఆ దేవదేవుని పొగడి పరమేశ్వర నీ దర్శన భాగ్యముగా నా జన్మ తరించింది.  నీ దర్శనముకన్న వేరు వరము నా లాంటి అల్ప జీవులకు కలదేనని.  తాను తపమాచరించు కారణము తెలిపి దేవాది దేవా ఇచ్చోటి మనుజులు ధర్మాధర్మముల విడనాడి దొరికిన జీవినేల్ల భక్షించుచు జీవ జాతిని మొత్తము నశింప చేయుచున్నారు.  వారాలనడ్డగించ మేమశక్తులము.  మమ్ము మేము కాపాడుకొనలేకుంటిమి కాన నేను నీ కృపన్ ఆ దుష్ట మనుజుల నిర్జించ నెంచి ఈ తపమాచరించితి. ఓ దీన రక్షకా ఆపద్బాంధవా దయతో  ఈ క్రూర మానవుల హస్తంబులనుండి మా జీవ సంతతిని కాపాడవె అని వేడెను.  నీవు దక్క నాకు అన్య దిక్కులేదు.  నీవు కాపాడనిచో అనతి కాలములో ఈ సృష్టిలో జీవ జాలము యావత్తు నశించగలదనెను.  అంత ఆ పరమేశ్వరుడు దయాళుడై ఓ సౌలొచ నీ ప్రార్ధనలో అర్ధమున్నది నీవు నీకొరకు కాక యావత్ నీ సోదర జీవుల నుద్ధరించ పూనినావు.  కాన తప్పక నీకు వరమ్మిచెద ననియెను.  మీ జీవ జలమును కాపాడ వలెనన్న ఆ దుష్ట మానవులకు మీ యెడ విరక్తి కలగవలెను.  అప్పుడే వారు మీ జోలికి రారు.  కానీ మీ మాంస రుచిమరిగిన వారు మిమ్ముల నోదులుటకు ఇష్టపడరు,  కన్నా దీనికోకే ఒక ఉపాయము కలదు అది ఏమన మీ మాంస భక్షణ వారి పాలిట ప్రాణహరణ కావలెను.  అట్లయిన వారు మీ జోలికి రారు.  కాన నేను ఒక సూక్ష్మ జీవిని పుట్టించి మీ మాంసమందు పంపెద తత్ కారణంబునఁ మీ మాంస భక్షణం చేసిన వారి ప్రాణముల ఆ క్రిమి హరించ గలదు.  అట్లని పరమేశుడు వరంబియ ఆ సౌలొచ మిగుల సంతసించి పరమేశుని వేనోళ్ల పొగడ  పరమేశ్వరుడు అంతర్దహనమాయె.  అంత ఆ సౌలొచ  తన పరివారంబుని చేరి జరిగిన దంతయు వివరించ జీవులెల్ల సంతసించె. 

పరమేశ్వరుని వరప్రభావమున సూక్ష్మ జీవి జీవించుట.  అంత ఆ జనులు ఇది ఎరుగక వారు ఎప్పటివలె జీవ హింస చేయుచు వివిధ రకముల జీవుల మాంస భక్షణం చేయుచుండిరి.  పరమేశ్వర వరప్రభావముచేత ఒక సూక్ష్మ క్రిమి ఆ మాంసములందు జెనించె.  తత్కారణంబున ఆ మాంసభక్షణ చేసిన వారికి   ఆ సూక్ష్మ క్రిమి సోకి వివిధ రకముల అనారోగ్యములు జెనిచి చివరకు వారలు మరణించుచుండిరి. 

చైనీయులు సుక్స్మక్రిమిని గుర్తించుట:  అంత అనేకులు అకారణముగా అనారోగ్యగ్రస్తులై మరణించుట అచ్చటి మేధావులకు, వైద్యులకు ప్రస్నార్ధకముగా మారినది.  వారు వివిధ పరిశోధనలు చేసి చివరకు ఆ సూక్ష్మ క్రిమి జాడ  కనుగొనిరి. ఇది ఒక నూతనమైన అతి సూక్షమైన క్రిమి దీనికి విరుగుడు ఔషధము వారాలకు తెలియనిదాయె.  అప్పుడు వారలు ఈ జీవికి కరోనా అని నామకరణంచేసి దాని సంహరణమొనర్చ పూనుకొనిరి.  నాటి నుండి అచటి వైద్యులు జనులకు మీరు సర్వ జీవ భక్షణ చేయ ఈ విపత్తు దాపురించే కాన మీరు మాంసాహారము మానుడని సూచించ వల్లే యని అనేక జనులు జీవ భక్షణం వీడిరి.  కానీ పరమేశ్వర వరప్రసాది యగు ఆ సూక్ష్మ క్రిమి నానాటికి విజృభించి యావత్ భూలోకమంతా వ్యాపించెను.  తత్ కారణంబునఁ జీవ భక్షణ చేయని వారాలకు కుడా ఇది ప్రాణాంతకంగా నయ్యెను.  వివివిధ దేశాధీశులు దీని నంతమొందించ జాడ కనక ఖిన్నులై జనులను గృహంబులు వీడి బయల్వెడలవద్దని ఆనతిచ్చిరి.  దేశాధీశులు మాటలు పెడచెవిన పెట్టిన వారికి ఈ వ్యాధి సంక్రమించి విగతజీవులైరి. 

జగన్మాత పరమేశ్వరుని వేడుకొనుట:  ఇది ఇటులుండ భూలోకములో జరుగుచున్న విపత్త్తుని గమనిచిన  జగన్మాత పరమేశ్వరి పతిని జేరి ప్రభు మీరు ఆ సౌలొచన కిచ్చిన వరమ్ము సర్వ మానవాళికి శాపంబాయే.  మీరే సర్వస్వమని నిత్యం మిమ్ములను వేడు మీ భక్తులు కుడా ఈ క్రిమి భారిన పడి వారి ప్రాణములొడ్డుచున్నారు.  కాన దయతో ఈ విపత్తునుండి మీ భక్తులను కాపాడమని వెడుకొన అంత పరమేశ్వరుడు ప్రసన్నుడాయె. 

పరమేశ్వరుడు భక్తులను కాపాడుట: ఓ పరమేష్ఠి నీవు కోరిన కోరిక సమంజసమైనది.  ఇది కేవలము సర్వ జీవ భక్షణ చేయు మానవరూప రాక్షసులను నిర్జించుటకే కానీ శిస్టులను శిక్షించుటకు కాదు.  నేను ఎప్పుడు నా భక్తులకడ ప్రసన్నుడనే. అంతేకాదు శిష్టులు, ధర్మచారులు, ఆచార పరులు, పరహిత పరాయణులను ఏళ్ళ వేళల కాపాడుట నా కర్తవ్యము.  కాన ధర్మ పరులకు ఈ క్రిమి సోకాదని తెలిపెను. 

ధర్మ పరుల కాపాడుట: నిత్యము  సౌచపరులగు ధర్మా చరుణులు ప్రాతః కాలమున లేచి సూర్య భగవానుని స్తుతిస్తు ప్రాఖ్ ముఖులై ఆదిత్యునిప్రార్ధించి పరిశుభ్ర వస్త్రముల ధరించి స్వయంపాకముల భుజిస్తూ, జీవహింస చేయక నిత్యమూ నన్ను శరణు చొచ్చి నా నామ జపము, తపము ఆచరిస్తూ.  పరులకు అపకారము తలపక అత్యాశకు పోక ధర్మ దీక్షా పరతంత్రులై గృహంబు వీడక  జీవింతురో వారికి ఈ సూక్ష్మ క్రిమి వలన ఎట్టి హాని కలగదని తెలిపెను.  అనతి కాలములోనే మానవుల మేధస్సుతో ఈ క్రిమికీ విరుగుడు కనుగొనెదరని,  తత్కాలము వరకు ప్రతి వారు గృహంబుల వీడి వీధులలో విహరించకూడదని పరమేశ్వరుడు పరమేష్ఠికిన్ తెలుప పార్వతియు సంతసించె.  నాటి నుండి శిష్ఠులైన భక్తకోటి ప్రాతః కాలమున లేచి స్నాన సంధ్యాదుల నాచరించి సూర్య భగవానుని ప్రాతః కాలమున స్తుతించి తత్ కిరణ ప్రేరణతో ఆరోగ్యంబున్ చేకూర్చుకొని నిత్యము భగవన్నామ పారాయణము, దైవ చింతనమొనర్చుతూ ధర్మాచరణ బద్ధులై జీవనం గడప మేధావుల కృషిని ఈ క్రిమికీ ఔషధము లభ్యమైయ్యే.  అంత ఆ ఔషధ ప్రభావమున జనులెల్లరు సుకులై పూర్ణాయ్సమంతులై జీవితులైరి అని శవనకాది మహమునులకు    సుతుడు కరోనా ఉద్భావము  దాని ఉపశమనముతెలుపు కరణోపాఖ్యానము తెలుప వారలు నిజాశ్రమములకరిగిరి. 
ఫలశృతి:  ఈ ఉపాఖ్యానం చదివి నిత్యం ధర్మ దీక్ష పరాయణులై మహాదేవుని నిత్యమూ పూజంచు వారాలకు ఈ కరోనా వ్యాధి సోకకుండును గాక.  ఓం తత్సత్. 

ఇది రేవాఖండే ప్రథమాశ్వాసే కరోనోపాఖ్యానం సమాప్తం. 


ఓం శాంతి శాంతి శాంతిహి 
సర్వే జానా సుఖినో భవంతు. 

గమనిక ఇది కేవలము కల్పితము.  ఈ వృత్తాన్తము ఏ పురాణ ఇతిహాసములలోను ప్రస్తావించ లేదు. 
__________________________________________________________________________________________________________________________________________________________________


 ఆయుర్వేద, హోమియో వైద్యులకు విజ్ఞప్తి ఇప్పుడు మనందరికీ ఒక విషయం తెలుస్తున్నది.  ఈ కోవెడు వైరస్ అనేక రూపాలుగా మారుతున్నది అని.  అంటే దీనికి వాక్సిన్ కనుగొనటం మేధావులకు సవాలుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అనైకమంది శాస్త్రవేత్తలు అనేక విధాలుగా అహర్నిశలు కృషి చేస్తూ ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనటానికి ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నట్లు మనకు వార్తలవల్ల తెలుస్తున్నది.  కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు విజయవంతం అయినట్లు మనకు  తెలియరాలేదు. మనం ఆశా వాదులం, మేధావుల ప్రయత్నం సఫలం కావాలని మనం నిత్యం దేముళ్ళను ప్రార్ధిస్తున్నాము. కానీ మనకు ఒకవిషయం మాత్రం కనపడుతున్నది అది నిత్యం పెరుగుతూవున్న కరోనా కేసులు.  ఏ రోజుకూడా ఇవాళ ఒక్క కేసుకూడా నమోదు కాలేదు అని చెప్పిన రోజు లేదు.  ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అంతే.  ఈ విధంగా వృద్ధి చెందుతుంటే ఈ మహమ్మారిని ఆపటం ఎవరి తరం, అనే ప్రశ్న ఉద్బవిస్తుంది.  దీనికి అంతం ఎప్పుడు.  ప్రజలంతా ఎప్పటిలాగా జీవనం గడిపే రోజు ఎప్పుడు వస్తుంది. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ అని రోగం తగ్గినవారినుండి సేకరించిన రక్తమునుండి తీసిన ప్లాస్మాను రోగులకు ఇంజక్ట్ చేస్తున్నారు.  ఈ విధానం సఫలం అయినట్లు చెపుతున్నారు.

ఈ ప్లాస్మా థెరపీ లాగానే మరొక విధానం నేను ప్రీతిపాదిస్తున్నాను.  అదేమిటంటే ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రాగానే అతని రక్తం వలసినంత తీసి దాచివుంచి తరువాత అతనికే ఎక్కిస్తే తప్పక రోగి కోలుకుంటాడని నా అభిప్రాయం. యెట్లా అంటే;

రోగ నిర్ధారణ జరిగిన సమయంలో రోగి పూర్తిగా రోగగ్రస్తుడు కాడు.  అతడు ప్రాధమికస్థితిలో కొంత ఆరోగ్యంగా కొంత అనారోగ్యంగా ఉంటాడు.  అతని శరీరం వైరస్తో యుద్ధం ప్రకటించి యాంటీబోడీస్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ యాంటీబోడీస్ కలిగిన రక్తం ఆ రోగినించి సేకరించి దాచిపెట్టాలి.  ఎప్పుడైతే శరీరంలో రక్తం తగిన మోతాదులో తగ్గుతుందో అప్పుడు అతని శరీరం తగ్గిన రక్తం భర్తీ చేయటానికి కొత్త రక్తం ఉత్పత్తి చేస్తుంది.  ఈ స్థితిలో ఆ వ్యక్తికి పండ్ల రసాలు, ఇతర పోషక విలువలు కలిగిం ఆహారపదార్ధాలు తగినంతగా ఇస్తే ఆ రోగి రక్తం త్వరగా ఉత్పత్తి ఆయె శరీరంలో ఉండాల్సిన రక్తం సమకూరుతుంది.  ఆ సమయంలో అతని నుండి సేకరించిన రక్తాన్ని అతనికే డూప్ చేస్తే అతని శరీరంలో రక్తం పెరిగి రక్తంలో వున్నా ఎర్ర రక్తకణాలు ఆక్సీజన్ వేగంగా సరఫరా చేస్తుంది.  అంతకు ముందు రక్తంలో వున్న యాంటీబాడీస్ ప్రస్తుతం వున్న వాటితోపాటు కలసి సమర్ధవంతంగా వైరస్ మీద దాడి చేసి రోగిని పూర్తిగా రోగమునుండి రక్షిస్తుంది.

ఈ విధానం వల్ల లాభాలు; ఏ మనిషి రక్తం తీస్తామో ఆ మనిషికే ఎక్కిస్తాము కాబట్టి ఎలాంటి గ్రూప్ పరీక్షలు చేయనవసరం లేదు. రోగి వ్యాధినిరోధకాలు శరీరంలో ఎక్కువగా చేరుతాయి కాబట్టి రోగి కోలుకోవడానికి ఎక్కువ శాతం తోట్పాడుతాయి. ఈ విష్యం సమర్ధవంతులైయిన వైద్యులు పరిగణలోకి తీసుకొని తగువిధంగా ఈ విధానం అమలు చేస్తే బాగుంటుంది.    


ప్రభుత్వాలు ఈ వ్యాధికి మందులేదు కాబట్టి ఇంట్లోనే ఉండమని లాక్ డౌన్ ప్రకటించాయి.  ప్రజలు కూడా తమని తాము కాపాడుకోవాలని ఇంటికే పరిమితం అయ్యారు.  వారందరు అభినందనీయులు.  కానీ ఎన్నాళ్ళు అనే ప్రశ్నకు జవాబు ఎవ్వరి వద్దా లేదు. కాబట్టి ఈ తరుణంలో కేవలం అల్లోపతి డాక్టర్లే కాకుండా ఇతర సాంప్రదాయ వైద్యులు కుడా నడుం బిగించాలిసిన సమయం.  సాంప్రదాయ వైద్యం కన్నా అల్లోపతి వైద్యం ప్రచుర్యం పొందటానికి కారణాలు రెండు. ఒకటి ఇంజక్షన్ వల్ల మందుని మనిషి రక్తంలోకి నేరుగా పంపించటం తత్వర రోగ నివారణ సత్వరంగా చేయగలగడం. రెండు చెడిపోయిన అవయవాన్ని ఆపరేషన్ చేసి తొలగించటం.  ఈ రెండు సుగుణాల వల్ల అల్లోపతి వైద్యం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.  కానీ అల్లోపతికన్నా ముందు వివిధ దేశాలలో వివిధ సాంప్రదాయ వైద్య విధానాలు వున్నాయి.  అప్పటి జనులు వాటివల్ల రోగాల బారినుండి కాపాదపడ్డారు.  మన దేశంలో పురాతన వైద్య విధానం ఆయుర్వేదం.  మన దేశంలో ఇంకా హోమియోపతి, యునాని వైద్య విధానాలుకూడా లభ్యమౌ తున్నాయి.  

ఆయురేదం: మన దేశంలో పూరితంగా ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలో వున్నది.  వేల సమస్తరాలు ఎందరో ఋషులు కస్టపడి సృష్టించిన వైద్య విధానం.  ఈ ఆయుర్వేదం. ధన్వంతరి, చెరకుడు మొదలగు మహర్షులు శ్రేమించి నిర్మించిన ఈ విద్య విధానం ఎంతో పురాతనమైనది మాత్రమే కాదు మానవాళికి ఎన్నో రకాల వ్యాదులనుండి కాపాడుతూ వున్నది. పూర్వం ఆపరేషనులు కుడా చేసేవారని మనకు గ్రంధాలూ చెపుతున్నాయి.  ఆ అపూర్వ జ్ఞ్యానసంపదఁ ఎటు పోయింది.   ఇప్పుడు కూడా ఎందరో ఆయుర్వేద దిగ్గజాలు ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. నేను ప్రార్ధించేది ఏమంటే మహానుభావులారా ఇప్పుడు సమయం ఆసన్నమైనది మీ అపూర్వ మేధస్సుతో ఈ కరొనకు మందును తయారు చేయండి. మానవాళిని కాపాడండి.  అనేక రకాల పాషాణాలు, విషాలు మనిషే చావు బతుకుల మధ్య కొట్లాడుకున్నపుడు వాడి మృత్యు వాత నుండి రక్షించినట్లు మన చరిత్ర చెపుతున్నది.  మరి ఇప్పుడు ఈ వైద్యులు ఎందుకు ముందుకు రావటంలేదు.   అయ్యా మీరు ఉపేక్షించకండి రండి ముందుకు రండి ఈ విపత్కర సమయంలో మానవాళికి చేయూతనివ్వండి.  మన దేశాధీశులను వినయపూర్వకంగా ఈ విధానంకూడా ఈ మహమ్మారినుండి జనులు కాపాడటానికి వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
ఈ సందర్భంలో నేను రెండు పద్ధతులు ప్రతిపాదించదలిచాను.
ఒకటి. మన గ్రామీణ ప్రాంతాలలో జ్వరాలు వస్తే కడుపు మీద సూదితో వాతలు పెట్టేవారు.  ఆ వాతలతో జ్వరాలు తగ్గేవి.  అదే మాదిరిగా కరోనా భారిన పడిన రోగుల కడుపు (abdomen)  మీద సూదితో వాటాలు పెడితే రోగం తగ్గవచ్చని భావిస్తున్న.

పని చేసే విధానం. ఎప్పుడైతే మనిషికి తన శరీరం కొంత భాగం కాలుతుందో అప్పుడు శరీర రక్షక విభాగం పనిచేసి ఆ గాయాన్ని నయం చేయటానికి యాంటీబోడీస్ని ఉత్పత్తి చేస్తుంది అట్లా ఉత్పత్తి ఐన యాంటీబాడీస్ ఈ వైరస్ మీద దాడి చేసి రోగాన్ని తగ్గించ వచ్చు. ఈ విధానం వల్ల ఎటువంటి నష్టము రోగికి వేరుగా ఉండదు.  కాక్ పోతే కాలిన గాయాలవల్ల కొంత బాధ పడవలసివుంటుంది.  ప్రాణాలు పోగొట్టుకోటం కన్నా గాయాల బాధలు అనుభవించటం మేలు కదా.

రెండో విధానం: గో మూత్రంతో అనైక రోగాలకు చికిత్స చేయవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెపుతున్నది.  కాబట్టి రోజు 10 మిల్లి లీటర్ల గోమూత్రాన్ని రోగులకు పరిగడుపున ఇస్తే వైరస్ మీద పని చేయవచ్చు.
ఫై రెండు విధానాలను అనుభవజ్ఞులైన వైద్యులు పరిశీలించి వివరించి ప్రభుత్వానికి తెలిపి ఈ కఠోర కరోనా మహారమారి నుండి మానవాళిని రక్షించాలని ప్రార్థిస్తున్నా;

ఇప్పుడు ఏ పద్దతి మంచిదా అని యోచించే సమయం కాదు ఏదో ఒక విధానం,  ప్రయత్నిస్తే తప్పకుండ ఫలితం లభిస్తుంది.  

హోమియోపతి:  జర్మనీ దేశంలో జన్మించిన డాక్టర్ Samuel Hahnemann (1755-1843),  చే ఆవిర్భవించిన  వైద్యం ఈ పద్దతి.  దీని మూల సూత్రం ఏమిటంటే  ఆరోగ్యవంతునికి ఏ మందు ఇస్తే అతనికి ఏరకమైన రోగ లక్షణాలు కనబడతాయో అదే మందు ఆ లక్షణాలు కలిగిం రోగికి ఇస్తే ఆ రోగం నయం అవుతుంది.  ఈ విధానం మనం మన భాషలో చెప్పాలంటే ముల్లుని ముల్లుతోటె తీయాలి అన్నట్లు. అప్పటి  వైద్య విధానానికి వ్యతిరేకంగా ఇది  ఉండటంతో ఆయనను అప్పుడు సమర్ధించలేదు. కాని కాలాంతరంలో ఈ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంతరించుకుంది.  మనదేశంలో కుడా ఈ వైద్యవిధానం బహుళ ప్రదాన్యత పొందింది.  అంతే కాక ఇటీవల జరిపిం ఒక సర్వేలో ఇక్కడ నూటికి 59 మంది ఈ వైద్యవిధానం పట్ల మొగ్గుచూపుతున్నారని తెలిసింది. మన దేశ ఆయుష్ మంత్రిత్వ విభాగం కరోనా రాకుండా arsenicum album 30c ని రోగనిరోధానికి వాడమని చెప్పటమే కాక అనేక హాస్పిటల్సులో ఉచితంగా ఇవ్వటం జరిగింది.  ఇక ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మందు మూడురోజులు వరుసగా వాడిన వారికి ఎవరికైనా కరోనా సోకిందా, లేదా అనే విషయం ఇప్పటివరకు సర్వ్ చేసిన దాఖలాలు లేవు.  ప్రభుత్వం ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని కరోనా రోగులు ఈ మందు రోగం రాకముందు వాడారా, లేదా అని ఆరా తీసి ఒకవేళ ఈ మందు వాడినవారికి కరోనా సోకితే ఈ మందు ప్రభావం వాళ్ళ మీద ఎంతవరకు వున్నది తెలుసుకోవాలి. నిజానికి నాకు తెలిసినంతవరకు హోమియోపతి విధానం ఒకరకంగా వాక్సిన్ లాగానే పని చేస్తుంది. మందు మందుయొక్క పొటెన్షిని సరిగా తెలుసుకొని ఉపయోగిస్తే తప్పకుండ ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది.  ఈ arsenicum album 30c పనిచేస్తే దానిని ఎందుకు వాడటంలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుని ఈ వైద్య విధానాన్ని ఈ కరోనా నివారణకు వినియోగించుకొనే దిశలో ఆలోచన చేస్తే బాగుంటుంది. 

నేను pubmed.gov అను website నుండి సేకరించిన విషయాన్ని యధాతధంగా ఇక్కడా ఇస్తున్నాను. 

Potentized homeopathic drug Arsenicum Album 30C positively modulates protein biomarkers and gene expressions in Saccharomyces cerevisae exposed to arsenate.

Abstract

OBJECTIVE:

This study examines if homeopathic drug Arsenicum Album 30C (Ars Alb 30C) can elicit ameliorative responses in yeast (Saccharomyces cerevisiae) exposed to arsenate.

METHODS:

The yeast S. cerevisiae 699 was cultured in a standard yeast extract peptone dextrose broth medium. It was exposed to the final concentration of 0.15 mmol/L arsenate for two intervals, 1 h and 2 h, respectively. The cell viability was determined along with the assessment of several toxicity biomarkers such as catalase (CAT), superoxide dismutase (SOD), total thiol (GSH) and glucose-6-phosphate dehydrogenase (G6PDH), lipid peroxidation, protein carbonylation and DNA damage. Reactive oxygen species (ROS) accumulation, expressions of relevant stress transcription activators like Yap-1 and Msn 2, and mRNA expression of yeast caspase-1 (Yca-1) were also measured.

RESULTS:

Treatment of arsenate increased lipid peroxidation, protein carbonylation, DNA damage, ROS accumulation and expressions of Yap-1, Msn 2 and Yca-1 and decreased GSH, G6PDH, CAT and SOD. Ars Alb 30C administration decreased lipid peroxidation, protein carbonylation, DNA damage, ROS formation and Msn 2 and Yca-1 expressions and increased cell viability, GSH, G6PDH, CAT and SOD significantly (P<0 .05="" a="" except="" expression.="" for="" in="" increase="" p="" slight="" yap-1="">

CONCLUSION:





Ars Alb 30C triggers ameliorative responses in S. cerevisiae exposed to arsenate.   

ఈ కరోనా వైరస్ నుండి మానవాళిని కాపాడాలన్నదే నా ప్రయత్నం.  నా ఆకాంక్ష నెరవేరాలని నేను విజయం పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం  ప్రార్ధిస్తూ సత్వర నివారణ కావాలని ఆశిస్తున్నా:
సర్వే జనా సుఖినో భవన్త
ఓం శాంతి శాంతి శాంతిః
__________________________________________________________________________________________________________________________________________________________________


1  శ్రీ కరుడవ్ పార్వతీదేవి
అగ్రసుతుని అనవరతము
స్తుతించెద  నే చేసెడి  పనులెల్ల
సఫలము కాగా భార్గవ




2  అమృతమన్న అమ్మ స్తన్యము  
కామధేనువున్న  అమ్మ దీవెన
కల్పవృక్షమన్న  అమ్మ ప్రేమ
స్వర్గమన్న మరి వేరు కాదయ అమ్మ వడియె భార్గవ

3  జీవుల యందు జాలియు
సతి, సుతులయందు ప్రేమయు
భగవంతుని మీద భక్తియు
గలవాడే మనుజుడన భార్గవ

4  ఉరక పరుల సొమ్ము కోరుటయు
తన సొత్తును ఇసుమంతయు ఇవ్వకుండుట
పర బాధల చూసి నవ్వుటయు
ఖలులులు చేసెడి  పనులు భార్గవ



5  అన్నదమ్ములు నావారని

అలిబిడ్డలు నావారని
ఆస్తిపాస్తులు నావనె బ్రాంతి నుంటివి 
కాలుడొచ్చిననాడు  కాయమ్ముకూడా నీది కాదయా భార్గవ



6  తనువూ,   మీద మోజు

తిండి మీద మోజు
ఇల్లు వాకిలి పైన మోజు
ఆలి బిడ్డల పైన మోజు
కట్టు బట్టల పైన మోజు
కాలమంత ఇటులఖర్చు చేస్తే
దైవ  సన్నిదికిచేరుటెటుల భార్గవ



7  అన్నదమ్ములు కల్ల

అలిబిడ్డలు కల్ల
ఇల్లువాకిలి కల్ల
ఆస్తిపాస్తులు కల్ల
ఆత్మ వక్కటే నిక్కము భార్గవ





8  తీయని  తేనెల తెలుగు పలుకక
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కేగాబ్రాకినట్లు భార్గవ

9 ఆకలితో తిన్న అన్నము
అవసరముకు అందిన ధనము
వైరితో తిరిగి కలిగిన సక్యము
ధరణిని మరువంగా తరమే భార్గవ

10  గంధము లేని సుమములు
సోయగము లేని మగువలు
మానవత్వము లేని మనుజుడును
ధరణిలో వ్యర్ధము భార్గవ

11  తల్లికి అన్నము పెట్టని వాడును
సతి సుతులను కానని వాడును
సఖునికి కీడు చేసెడి వాడును
భువికే భారము కదరా  భార్గవ

12  కలియిండదు కలకాలము
బలముండదు బహుకాలము
కలిమి  లేముల కలిసున్నదే
దాంపత్యమన్నయిలలో భార్గవ

13  ఘడియకు తప్పులు వేతికేడి పురుషుని తోటి జీవితము
ప్రతి పనికి సాధించేడుయజమాని వద్ద కొలువును
ఎంత చదివిన వంటపట్టని  సాహిత్యవిద్యయు 
వెను వెంటనే వదలి వేయుట మంచిది భార్గవ

14  తా తినక పరుల కిచ్చుట దైవత్వము
తా తిని పరుల కిచ్చుట మానవత్వము
తా తిని పరుల మరచుట రాక్షసత్వము
మనుజులము మానవత్వమున్న చాలు భార్గవ

15  అమ్మను అడుగక పెట్టదు అన్నము
తండ్రిని కోరనిదే ఇవ్వడు ఎదియును 
సుతుడును కోరకనే సమకూర్చాడు దేదియు
అడుగుటకు వేనుకిడిన దొరకదు ఏదియు భార్గవ

16  కలహంభులకు దూరముగా నుండుము
చెలిమికి  సాదరమున స్వాగతించుము 
పరులకు ఎప్పుడు కీడును సలుపకు
మనుజులు చేయ మంచి పనులివియే భార్గవ

17  పరులను యాచించకు 
ఉన్నదానితో సంతసించుము
లేదని దిగులు  పడకు
తృప్తిని మించిన సౌక్యమేది భార్గవ

18  అందినదియే అందలము
అందనిదానికై అర్రులు చాచకు
కొందరికే అన్నియు అందును
అందరకు అన్నీ అందవు భార్గవ

19  పరులను ప్రేమతో పిలువుము
అరువులకి ఆశ  పడకు
తనువుఫై మోహ పడకు
ఇవేయే పో కావలసినవి భార్గవ

20  కాలంబుకు విలువ నీయుము
హేమంబును కూడా తృణముగా చూడుము
సాయంబుకు ముందు నుండుము
వాదునకు వెనుక నుండుటయే మిన్న భార్గవ

21  హరి నామ స్మరణ మరువకు
సిరులను త్యదించుటకు వెరువకు
జ్ఞ్యాతుల దరి  చేర నివ్వకు
భక్తిని మించిన మార్గ మ్యేది భార్గవ

22  కోరుము ధనమును భగవంతుని
పరులకు సాకారము చేయుటకు
కోరుము ఆయువుని దేవుని
నిరంతర నామ స్మరణ చైయను
ఇతరములన్నియు వ్యర్ధము భార్గవ

23 సంకల్పముకి మించినది లేదు
ప్రారంభించుటయే మంచి ముహూర్తము
అవరోధము లేకసాగుటయే అవిఘ్న మన్న
విఠలాక్షుని కృపయున్న సర్వము సమకూరు భార్గవ

24  సాదువుల యెడ ప్రేమ
బలహీనుల యెడ జాలియు 
తన వారి ఫై మమకారము
చూపెడు వాడెపో మాన్యుడన భార్గవ

25  అమ్బలియు లేని నాడును
అష్ట ఐశ్వర్యములు సిద్దించిన నాడును
అయోనిజుని మరువని వాడె
నిజమగు భక్తుడు కదరా భార్గవ

26  సిరి కోరిన యంతనే రాదు
ఖ్యాతి ప్రాకులాడిన పొందలేరు
ఈసునిఆజ్ఞ తోటే ఇలను
కష్ట శుకములు కలుగును భార్గవ

27  తనదన్నదిఏదియును లేని వాడును
కష్ట సుకముల సమముగా చుసేడి వాడును
మనవమానముల తొణకని వాడును
నిజమగు ముముక్షువన్నకదరా భార్గవ

28 కవితల నల్లగ వచ్చును 
మూగకు మాటలు నేర్పను వచ్చును 
వైరిని చేరి ప్రియభాషణలాడగ వచ్చును 
దైవమ్ము వెన్నంటి ఉంటే భార్గవ 


29 ప్రేమను పిలచిన పసిపాపలునగుదురు 
కోపగించిన వెను వెంటనే యడ్చుదురు
భాష తెలియని చిన్నారులు కూడా
భావమెరుగ గలరు ఇదియ సృష్టి యన భార్గవ

30  అమ్మ అనుగ్రహము లేనినాడును
తిన తిండికరువైన నాడును
నావారను వారు లేని నాడును
జీవించుట ఏమి సుఖము భార్గవ

31  ప్రీతినిపిలిచి పెట్టినదియే పాయసము
ద్వేషంబుతో పడవేసినభక్ష్యములును విషంబు
ప్రేమను తినిపించినదియేమాతృత్వమన్న 
తల్లి ప్రేమను పొందని జన్మ వృధా భార్గవ

32 
మామిడి కాయలు చూడ నోక్కతీరుగుండు  
తరిగి తిన్న కానీ తీపి పులుపు తెలియదు 
మనుషులందరు  చూడ నొక్క తీరునుండు 
చేరి పలకరించిన గాని  గుణములెరుగలేమయ భార్గవ 


33  తనదన్నదిఏదియును లేని వాడును
కష్టసుఖముల సమముగా చుసేడివాడును
మనవమానముల తొణకని వాడును
నిజమగు ముముషువన్నకదరా భార్గవ

34  కోరనిదేఏదియు రాదు
కోరినను కొన్ని రావు
పొందుట కర్హమినది కోరిన
జగదీసుడు నీ కిచ్చును భార్గవ

35 తన పని కావలెనన్న 
ఆఫీసరు చేయి తడపక తప్పదు యేరికైనను 
ఏలనన ఇరుసునఁ గ్రీసు పెట్టక 
భారత ప్రెసిడెంటు కారు కూడా కదలదు భార్గవ 

 36 కారణము లేకుండా భార్య తోటి తగవులాడకు 
అనవసరముగా నీ పిల్లల కోపగించకు 
మిత్రునితోటి కపటముగా వర్తించకు 
ఈవై పో సజ్జనుడు చేయవలసినది భార్గవ 

37 సిరి వచ్చిన గర్వపడకు 
ధనముడిగిన చింతపడకు 
కలిమి లేముల తొణకక 
జీవనము గడుపుటే ప్రాజ్ఞుల పని భార్గవ 

38  ఆశలకు రెక్కలు వచ్చిన
రెక్కలు వచ్చిన చీమల భంగిని
అనతి కాలమున నేలను వ్రాలును
ఉహల నదుపు చేసిన వాడె మనుజుడు భార్గవ

39  సుఖములు మరగిన వడలు సోమరియగున్
శ్రమ పడిన కాని తనువుకు ఆరోగ్యమబ్బదు  
కష్ట సుఖముల సమముగ చూసెడి   మనుజుడే మనుజుడు 
సాన పెట్టిన కాని కత్తికి పదునురాదు భార్గవ

40  నీతులు పరులకు చెప్పుట తేలిక
వాటినిఆచరించుటయే దుర్లభము
తాచేసినదిచెప్పుట మాన్యుల  గుణము
మాన్యుల  నవలంబించుట శ్రేయము భార్గవ

41  ప్రాణమున్నంత  వరకు ప్రార్ధించెద పరమేశుని 
జీవ మున్నంతవరకు జపియించెద జగదీసుని
ఊపిరున్నన్త వరకు పూజిన్చెద ఆయోనిజుని
నీది నీదరికి చేరువరకు అన్యుల తలవడు భార్గవ  

42 తెనుగు దేశమున పుట్టి తెలుగు వాగ్మయం నాకళించి 
సుకవితల చెప్పు కవి పండితులు గాక అన్యులెరుగుదురే 
తెలుగు భాషలోని గరిమనైన కానీ  మధురిమను కానీ   
తల్లి పాల తీపి తనయుడు గాక ఇతరులెరుగుదురే భార్గవ  

43  యజమాని సమర్ధుడైన గృహము అవరోధములు లేక నడుచును 
అసమర్ధపు గృహస్తు ఇంట ఎంత సంపద వున్నా తిన తిండి ఉండదు 
 ఏలనన కట్ట దృఢముగ వున్న చెరువులో నీరు వున్నటుల 
కట్టలు తెగిన తటాకమున ఉండునా భార్గవ 

44  ఈ జగత్తు పుట్టుకకు కారకుడెవ్వఁడు 
జనన మరణములు ఎవరి ఆధీనముననున్నవి 
పంచభూతముల మూలమెవ్వడు 
హృదయబౌడవు అట్టి ఈశ్వరునే శేరణువేడెద భార్గవ 

45  అడగక  ఉచిత సలహాలిచ్చుట  
బాధలో నున్న వారిని  చూసి పరిహసించుట 
తోటివారితో తన గొప్పలు చెప్పుకొనుట 
మాన్యులు చేయదగినవి కావు భార్గవ 

46  మనసు పరవళ్ళుత్రొక్క వలెను
హృదయమానంద డోలికలనూగవలెను
బుద్ధి పరిపక్వత నొంది పరవశింపవలెను
కవిత యన్న యీరీతి నుండవలెను భార్గవ 


47  ప్రౌడ కవిత చెప్ప పండితులు ఇష్ట పడుదురు 
సరళ కవిత నల్ల సామాన్యులు సంతసిన్తురు 
పండిత పామరులు మెచ్చు రీతి కవిత చెప్పుట 
కడలి చిలికినమృతము బడచునట్లు భార్గవ 

48  ఆటవెలదులు కావు తేటగీతులు కావు 
శీస పద్యమసలు కానేకాదు 
మనసు నచిన రీతి నే కవిత నల్లితి 
నచ్చ నన్నా నీవు మేచ్చు కున్నా  కానీ  భార్గవ 

49 పుత్రుడు సమర్ధుడైన తండ్రి కష్టములతీర్చి కీర్తినిపెంచున్ 
మల్లె తీగకు పూలు పూసి పరిమళించిన రీతిన్ 
కొడుకు దుర్మార్గుడైన సంపదలహరించి వానిని వీధికి తెచ్చును 
తులసి వనమున గంజాయి మొక్క భంగిని  భార్గవ 

50 తండ్రి గుణముల బట్టి 
పుత్రుని సంస్కార మబ్బు
నీచ తండ్రికి గుణవంతుడెలా కలుగు 
కాకి పిల్ల కోకిల కాదుగా భార్గవ 

51 ఆశు కవులు అష్టావధానులు 
పురవీధుల తిరుగుచుండ తదన్యులు 
విశ్వవిద్యాలయాల నేలుచుండిరి 
వెన్నల అడవికాయ పురముల అంధకారామైనట్లు  భార్గవ 

52.మొదలు పెట్టరు ఏ కార్యమును సోమరులు 
మొదలు పెట్టి మధ్యలో ఆపుదురు అస్థిమిత పరులు 
ఎన్ని కష్టములేదురైనను తా తలచిన పని పరిపూర్ణము చేదురు ధీరులైన మానవులు లాభాపేక్ష లేకనే భార్గవ 
53. పరుండుటకు పాన్పు నేతకడు దుస్తులలో అందము చూడడు తిండిలో రుచుల కెగబ్రాకాడు  ఉన్నదానితో సరిపెట్టుకొనును కానీ తన పనిలోని లగ్నతను మాత్రము వీడడు కార్య సాధకుడు సుఖ ధుఃఖఃముల తలపడు  మది భార్గవ 
54.  సరిగమలు సరిగా పాడారాని 
వారు సంగీతవిద్వంసులు,
యతి ప్రాసలు తెలియనివారు 
కవి పండితులుగాను వప్పారుచుండిరి 
ఆహా హ తెలుగు సంస్కృతి ఏమికానున్నదో భార్గవ 

________________________________________________________________________________________________


భారత దేశ డొమెస్టిక్ విమానాల టికెట్ కొనుగోలుకోసం  ఈ క్రింది లింకులు సందర్శించండి 

https://in.via.com/

మీరు  కూడలి ప్రదేశాలలో ఉంటే  వయ డాట్ కం ఏజెన్సీ తీసుకొని విమానాల టికెట్ల వ్యాపారం చేయవచ్చు.  మీకు ఒక కంప్యూటర్,  బ్యాంకు  అకౌంట్ ఉంటే చాలు. 

https://www.cleartrip.com

https://www.makemytrip.com/flights/

https://www.cleartrip.com/offers/india/domestic-flights



https://www.goibibo.com/offers/flight-offers/

రైల్, బస్   టికెట్ కోసం 


రైల్  టికెట్ కోసం క్రింది లింకుని  సందర్శించండి.  ఇది భారత దేశ సైట్ ఇక్కడ మీరు మీకు కావలసిన రైల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.  కానీ టికెట్ వ్యాపారం చేయటానికి లేదు.  కేవలం మీకు మీవారికి మాత్రమే మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు.   మీకు కొన్ని పెద్ద పెద్ద స్టేషన్లలో గదులు కూడా అద్దెకు లభిస్తాయి.  మీరు అంతర్జాలంలో నేరుగా గదిని కూడా బుక్ చేసుకోవచ్చు.  టికెట్ల వ్యాపారం చేసిన The Indian Railway Act ప్రకారము శిక్షార్హులు. 


 https://www.irctc.co.in/nget/train-search  


ఇక తెలంగాణ బస్సు టికెట్టుకోసం  ఇక్కడ క్లిక్ చేయండి


http://tsrtconline.in/oprs-web/services/coaches.do


ఆంధ్రప్రదేశ్  బస్సు టికెట్టుకోసం  ఇక్కడ క్లిక్ చేయండి


http://www.apsrtconline.in/oprs-web/



ప్రయివేట్ బస్సుల టికెట్ల కోసం రెడ్ బస్సు డాట్ కామ్


https://www.redbus.in



ప్రపంచ యాత్ర కోసం క్రింది లింకుని చుడండి 



https://www.veenaworld.com/world 

భారతదేశ  యాత్ర కోసం  క్రింది లింకుని దర్శించండి

http://www.india-tour.com/india-statewise/index.html 


కథలు చదివే ప్రేక్షకులకోసం క్రింది లింకుని చుడండి 

http://kinige.com/ 

ఇక్కడ మీరు తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, హిందీ భాషలలోని సాహిత్యాన్ని చదవవచ్చు 


తెలుగు వార్తా పత్రికలకు క్రింది లింకులను చుడండి. 

http://www.andhrabhoomi.net/atham

http://www.vaartha.com/

http://www.suryaa.com/

http://www.sakshi.com/

http://www.prajasakti.com/home

http://www.eenadu.net/

ఇంటినుండి పనిచేయండి 

ఈ క్రింది సైట్లలో నుండి మీరు ఇంటినుండి పనిచేయవచ్చు కానీ మీరు జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకోండి. ఒక్క విషయం మీకు  ఏవిధమైన కష్ట, నష్ఠాలు కలిగిన బ్లాగరికి సంబంధంలేదు. ఆలోచించి అడుగు ముందుకు వేయండి.  శుభమస్తు 

Find top10ns employments that you can do from home and profit.
1. virtualofficejob : https://www.virtualofficejob.com
2. Truelancer : https://www.truelancer.com/
3. Earnpartimejobs : https://www.earnparttimejobs.com/
6. 2captcha : https://2captcha.com/
7. Clickworker : https://www.clickworker.com/

 I wanted to say thanks. I found out first about upwork.com on your page here kavulu.blogspot.com/p/blog-page_31.html, and it gave me a lot of food for thought regarding becoming a freelancer.
I was starting from scratch, and it’s quite frightening. I got two jobs already and I think it is worth it to say "thank you" via email.
Also, I looked around and I found a helpful guide, it is really thorough and covers all the topics I wondered about.
I thought it would be a nice addition to your page, for all the people like me, who want to become a freelancer but don’t know where to start.
I really enjoyed the tips it gives for each situation as well as the action items.
Thanks for helping freelancers everywhere,
Erica

టైపింగ్ సంబంధిత పనులకోసం క్రింది లింకుని చేరండి 
https://workfromhomehappiness.com/19-transcription-jobs-online-for-beginners/ 

నూతన యజ్ఞోపవీత ధారణ విధి

గణేశ స్తోత్రం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||

గురు శ్లోకం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

యా కుందేందు తుషార హార ధవళాయా శుభ్ర వస్త్రావృతా |యా వీణా వరదండ మండిత కరాయా శ్వేత పద్మాసనా |యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |

ఆచమన౦
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా) ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య) ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య) ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య) ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా) ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా) ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా) ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా) ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య) ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా) ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)
ప్రాణాయామః
ప్రణవస్య పరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతా దైవీ గాయత్రి చ్చంద: ప్రాణాయామే వినియోగ:
 
ఓం భూః ఓం భువః ఓ౦ సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓ౦ సత్యమ్ ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ||ఓమాపో జ్యోతీ రసో‌మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||సంకల్పమ్ 
మమోపాత్తదురిత క్షయద్వారాశ్రీ పరమేశ్వర ముద్దిస్యశ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభేశోభన ముహుర్తేశ్రీ మహావిష్ణోరాఙ్ఞయాప్రవర్త మానస్యఅద్య బ్రహ్మణఃద్వితీయ పరార్థేశ్వేతవరాహ కల్పేవైవశ్వత మన్వంతరేఅష్టవింశతతిమే కలియుగేకలి ప్రథమ చరణేమేరోర్దక్షిణ దిగ్భాగేజంబూ ద్వీపేభరత వర్షేభరత ఖండే,మేరోదక్షిణేతీరేస్వగృహే-శోభన గృహే‘ ..... సన్నిథౌఅస్మిన్వర్తమానవ్యావహారికచాంద్రమానేన, … సంవత్సరే, … అయనే, .....ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్రశుభ యోగశుభ కరణఏవంగుణ,విశేషణవిశిష్ఠాయాంశుభ తిథౌ, ..… గోత్రోత్పన్న ..… నామధేయస్యమమ శ్రౌత స్మార్త విధివిహితనిత్యకర్మ సదాచార అనుష్టాన యోగ్యతాసిద్ద్యర్థం (జాతాసౌచ,మృతాసౌచ జనిత దొష ప్రాయశ్చిత్తార్తమ్)బ్రహ్మతేజోభివృద్ధ్యర్థమ్శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయశ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థమ్ నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే !  
యజ్ఞోపవీత సంస్కారమ్
నూతన యజ్ఞోపవీత మును ఒక ఇత్తడి గాని రాగి గాని బంగారం గాని పళ్ళెము లొ వుంచి పసుపు కుంకుమ అల్ది కలశ పాత్రలోని శుద్ద నీటిని గాయత్రి మంత్రమును ఊచ్చరిస్తూ సంప్రొక్షించాలి
గాయత్రీ మంత్రం: 
ఓం భూర్భువస్సువః తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
జలాభిమ౦త్రణ౦
కలశ పాత్రలోని శుద్ద నీటిని సంప్రొక్షిస్తూ ఈ క్రింది మంత్రమును పఠించాలి
ఓం ఆపో హిష్ఠా మయోభువః తా న ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసః తస్య భాజయతే హ నః ఉషతీరివ మాతరః తస్మా అరంగ మామ వః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః |ప్రాణ ప్రతిష్ఠ
ఓ౦! అసునీతే పునరస్మాసు చక్షు: పున: ప్రాణమిహనోదేహి భోగమ్ జ్యోక్ పశ్యేమ సూర్యముచ్ఛర౦త
మనుమతే మృళయా న: స్వస్తి:
ఇతి ప్రాణప్రతిష్టాపన౦ కృత్వా
ఓ౦! నమో నారాయణాయ (ఎనిమిది సార్లు ఉచ్చరించాలి)బ్రహ్మ
బ్రహ్మజఙ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత: సురుచోవేన ఆవ:
సభుధ్న్యా ఉపమా అస్య విష్టాస్సతశ్చ యోనిమసతశ్చ వివ:
ఓం! వేదాత్మనాయవిద్మహే హిరణ్యగర్భాయ ధీమహి
తన్నోబ్రహ్మ ప్రచోదయాత్
రుద్ర
త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతా''త్
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
విష్ణు
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ సమూఢమస్య పాగ్‍మ్ సురే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ
విశ్వోదయ స్థితిలయో న్నియతి ప్రదాయ
ఙ్ఞానప్రదాయ విభుధాసుర సౌఖ్య దు:ఖ
సత్కారణాయ వితతాయ నమో నమస్తే
నవత౦తు దేవతాహ్వాన౦
ఓ౦కారోగ్నిశ్చ నాగశ్చ సోమ: పితృప్రజాపతీ
వాయుసూర్యౌ విశ్వేదేవా ఇత్యేతాస్త౦తుదేవతా:
త౦తుదేవతానామావాహయామి!
ఓ౦!కార౦ ప్రథమత౦తౌ ఆవాహయామి
అగ్ని౦ ద్వితీయత౦తౌ ఆవాహయామి
నాగాన్ తృతీయత౦తౌ ఆవాహయామి
సోమ౦ చతుర్థత౦తౌ ఆవాహయామి
పితౄన్ ప౦చమత౦తౌ ఆవాహయామి
ప్రజాపతిమ్ షష్టత౦తౌ ఆవాహయామి
వాయు౦ సప్తమత౦తౌ ఆవాహయామి
సూర్యమ్ అష్టమత౦తౌ ఆవాహయామి
విశ్వేదేవాన్ నవమత౦తౌ ఆవాహయామి
ఋగ్వేద౦ ప్రథమదోరకే ఆవాహయామి
యజుర్వేద౦ ద్వితీయదోరకే ఆవాహయామి
సామవేద౦ తృతీయదోరకే ఆవాహయామి
గాయత్రి దేవి - సూర్యనారాయణ
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసంమితమ్ గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే సర్వ వర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతి ఓజో‌సి సహో‌సి బలమసి భ్రాజో‌సి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోమ్ గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి
ధ్యేయ: సదా సవితృమ౦డల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన సన్నివిష్ట: కేయూరవాన్ మకరకు౦డలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపు: ధృత శ౦ఖ చక్ర:
ఉదుత్త్య౦ జాతవేదస్౦ దేవ౦ వహ౦తి కేతవ:
దృశే విస్వాయ సూర్య౦

యజ్ఞోపవీత ధారణమ్
యజ్ఞోపవీత౦ ఇతి మ౦త్రస్యపరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతాత్రిష్టుప్ చ్చ౦ద: యజ్ఞోపవీత ధారణే వినియోగ:
యజ్ఞోపవీతము మూడు పోగులు గానినాలుగు పోగులు గా గాని వుంటుందిబ్రహ్మచారి ఒక పోగును మాత్రమే దరించాలిగృహస్తు మూడు లేక నాలుగు పోగులు వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి దరించాలి. బ్రహ్మ ముడి  అర చేతుల యందు వుంచి ఈ క్రింది మంత్రమును పఠిస్తూ మొదటి పోగును ధరించాలి.
యజ్ఞోపవీత ధారణ మ౦త్ర౦
యజ్ఞోపవీత౦ పరమ౦ పవిత్ర౦ ప్రజాపతేర్యత్సహజ౦ పురస్తాత్ 
ఆయుష్యమగ్ర్య౦ ప్రతిము౦చ శుభ్ర౦ యజ్ఞోపవీత౦ బలమస్తు తేజ:
తిరిగి ఆచమనము చేయాలిగాయత్రి మంత్రమును పఠించాలి
రొండవ పోగు మ౦త్ర౦: మమ గృహస్థాస్రమ యొగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలిగాయత్రి మంత్రమును పఠించాలి
మూడవ పోగు మ౦త్ర౦: ఉత్తరీయర్థం తృతీయ  యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలిగాయత్రి మంత్రమును పఠించాలి
నాల్గవ పోగు మ౦త్ర౦ ధానార్థం ఛతుర్థ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
యజ్ఞోపవీత విసర్జన మ౦త్ర౦
ఉపవీతమ్ భిన్నత౦తు౦ జీర్ణ౦ కస్మల దూషిత౦
విసృజామి జలే బ్రహ్మణ్ వర్చో ధీర్ఘాయురస్తుమే
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
… 
ప్రవరాన్విత …. గోత్రోత్పన్న ….… శర్మ.......... అహం భో అభివాదయే
సమర్పణ
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపస్స౦ధ్యా క్రియాదిషు
న్యూన౦ స౦పూర్ణతా౦ యాతి సధ్యో వ౦దే తమచ్యుతమ్
మ౦త్రహీన౦ క్రియాహీన౦ భక్తిహీన౦ రమాపతే
యత్కృత౦తు మయా దేవ పరిపూర్ణ౦ తదస్తుమే
అనేన యజ్ఞోపవీత ధారణేన భగవాన్ భారతీరమణ ముఖ్య ప్రాణా౦తర్గత
శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ,  శ్రీ లక్ష్మీనారాయణ ప్రీయ౦తా౦ వరదో భవతు శ్రీ కృష్ణార్పణమస్తు
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా‌త్మనా వా ప్రకృతే స్స్వభావాత్ కరోమి యద్యత్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
అచ్యుతాయ నమ: అన౦తాయ నమ: గోవి౦దాయ నమ:

ఈ క్రింది సైట్ నుండి గ్రహించబడినది 
http://gayatrisevasamithi.blogspot.in/p/blog-page_27.html 

ఎక్కువ నీరు త్రాగటము ఆరోగ్యానికి హనికరమా 

ఎక్కువ నీరు త్రాగటం వలన మన శరిరములొని సొడియం  చాల పలచపడటం వలన water intoxication అనే స్థితి కలుగుతుంది.  మనము రోజుకి 6 గ్లాసుల నీరు తీసుకుంటే అది మన శేరిరానికి మంచిది కానీ అతి సర్వేత్ర వర్జితే అన్నట్లు నీరు శరీరానికి మంచిదని అదే పనిగా ఆహారం తీసుకోకుండా నీరు తాగుతువుంటే శరీరం శుష్కించి పోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త రోజు తగినన్ని నీరు మాత్రమే తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి 

ఆరోగ్యమే మహాభాగ్యం 

 పెట్రోల్ పొదుపుకి మార్గాలు 

 రోజు రోజుకి పెట్రోల్ ధరలతో ప్రతివారు ఆలోచనలో పడ్డారు మోటార్ సైకిల్ వున్నా సైకిలు ఉంటే బాగుండేది అని కొందరు, బస్సులో పోతే యెట్లా ఉంటుందో అని కొందరు ఆలోచిస్తున్నారు.  ఇక కారు వున్న వారు అటు కారు తీయలేక బస్సు ఎక్కలేక అనేక అవస్థలు పడుతున్నారు.  వారికోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాను. 

1) మీరు మీ కారుని సిగ్నల్ దగ్గర ఇంజన్  ఆపండి అట్లా కొంత పెట్రోల్ సేవ్ చేయవచ్చు. 

2) ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కేటప్పుడు ఇంజన్ ఆన్ చేసి దెగేరప్పుడు మాత్రం నూట్రాల్లో దిగండి ఈ విధానం కొంత పెట్రోల్ ఖర్చు తగ్గిస్తోంది . 

3) పెట్రోల్ బంకుల్లో కొంతమంది మీ కారు అద్దాలను తుడిచి డబ్బులు అడుగుతారు వాళ్లతో కిలోమీటర్ తోస్తే 10 రూపాయలు  ఇస్తామని కొంతదూరం తోయించుకోండి మీ ఖర్చు కొంత  తగ్గిచుకోవచ్చు. 

4) మొహమాటంతో పెట్రలో మిగులు.  
ఈ చిట్కా చాలామందికి ఉపయోగంగా ఉంటుంది.  మీరు కారులో వెళ్ళేరప్పుడు కొంతంనుంది మీకుతెలిసిన ఓ సి గళ్ళు అదేనండి ఊరికే వస్తే ఫేనాయిల్ తాగే వాళ్ళ మీ కారు ఎక్కుతామంటే వాళ్ళని ఎక్కించుకోండి కొంత దూరం వెళ్లిన తరువాత మీరే ఇంజిన్ ఆపి వాళ్ళని తోయమని ఫురమాయించండి. వాళ్ళు తోస్తారు.  ఆలా కొంత పెట్రల్ ఆదా  చేసుకోవచ్చు. 

5)  ఇక పైదానిలోనే ఇంకొక చిట్కా మీరు ఆ ఓ సిగాళ్ళని నేరుగా పెట్రోల్ బంకుకి తీసుకొని వెళ్ళండి.  పెట్రల్ పోస్తుండుగా మీరు సెల్ పోను తీసుకొని ప్రక్కకి వెళ్లి మాట్లాడుతన్నట్లు నటించండి.  అప్పుడు వాళ్ళు పెట్రోల్ బిల్ కడతారు.  కానీ కొంతమంది ఓ సి గళ్ళు మీకన్నా ఎక్కువ తెలివి ప్రదర్శించి మీరు కారుని బంకు వైపు తిప్పగానే దిగి అరె నాకు ఇక్కడ పని ఉందని జారుకుంటారు జాగ్రత్త. 

6) ఇంకొక అనుబంధ చిట్కా మీరు మీ జేబు తడుముకున్నట్లు నటించి అరె నేను పర్సు తేవటం మరిచానే అన్నా నీదగ్గర డబ్బులుంటే ఇస్తావా అని బిల్లు కట్టించండి.  గుర్తు పెట్టుకోండి పొరపాటున కూడా ఇంకొక్క మాట, అదేనండి రేపు ఇస్తాను అని అనకండి.  ఎందుకంటె మరుసటి రోజు మీరు కనబడంగానే నిర్మొహమాటంగా మిమ్మల్ని అడుగుతారు.  ఎందుకంటె ముందే చెప్పుకున్నాము కదా వాళ్ళు ఓ సి గాళ్ళని. 

7) దర్జాగా మీరు పెట్రోల్ లేకుండ కారు నడిపే మార్గాలు.  
ఇవి కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. 
అ ) మీ కారుకి ముందు రెండు కొక్కాలు బిగించి రెండు దున్నపోతుల్ని కట్టండి.  చక్కగా వాటిని తోలుకుంటూ కారులో వేళ్ళ వచ్చు. 
ఆ) మీ కారు కొక్కాలకు రెండు గాడిదలని  కట్టండి.  చక్కగా వాటిని తోలుకుంటూ కారులో వేళ్ళ వచ్చు. 
ఇ ) మీరు ఎప్పుడు ఎద్దులని, లేక ఒంటెలని మరియు గుఱ్ఱాలని  కట్టాలని ఆలోచించకండి. అవి వేగంగా వెలుతాయి మీరు నడపలేరు. అదేనండి మీరు తోలలేరు. 
ఇక్కడ చెప్పిన వాటిని మీకు నచినది మీరు ఎంచుకోవచ్చు.  
గమనిక: మీకు ఏదైనా పైన తెలిపిన ఉపాయం వల్ల ప్రమాదం వాటిల్లితే నా పూచి లేదు. 
షర : ఈ చిట్కాలు కేవలం హాస్యానికి వ్రాసినవె ఆచరణ కోసం కాదు. 

వినాయక చవితి ప్రాధాన్యత

ది. 13-9-2018 వినాయక చవితి అయ్యింది.  అందరికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.  ఆ విజ్ఞేశ్వరుడు అందరికి వారి వారి జీవితాలలో విజ్ఞాలను కలగకుండా కాపాడాలని ప్రార్ధిస్తున్నాము. 

వినాయక చవితి అంటేనే ఇది ముఖ్యంగా పిల్లల పండుగా.  మన హిందూ సంప్రదాయంలో, పిల్లలకి, పెద్దలకి అలాగే స్త్రీలకి ఎవరి పండుగలు వారికీ వున్నాయి.  ఇది చాల మంచి విషయం కదా.   పిల్లలకి 21 రకాల పత్రి అదేనండి ఔషదాలని ఈ పండగ పరిచయం చేస్తుంది. అవి 
1)  మాచీ పత్రం: మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి. 

2) బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.

3)  బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు. 

4) దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. 

5) దుత్తూర పత్రం: దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి. 

6) బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.   

7) అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

8)  తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. 

9) చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. 

10) కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. 

11) విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. 

12) దాడిమీ పత్రం: దాడిమీ అంటె దానిమ్మ ఆకు.  

13) దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. 

14) మరువక పత్రం: దీనిని మరువం అని కూడా అంటారు.

15)  సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు. 

16) జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. 

17) గండలీ పత్రం: దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది. 

18) శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

19) అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. 

20)  అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. 

21) అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. 

ఇంక మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని పైన తెలిపిన పత్రితో భక్తితో  పూజించి నవరాత్రులు అంటే 9 రోజులు లేకపోతె 3 లేక 5 రోజులు పూజ చేసిన తరువాత ఆ పత్రితో సహా వినాయక మృత్తికా విగ్రహాన్ని జలనిమజ్జనం చేయాలి.  ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటి వున్నది. ముందుగా పిల్లలకి ఔషధ మొక్కలని గుర్తించటం తరువాత వాటిని శ్రద్ధగా  సేకరించటం సేకరించిన ఆకులతో పూజించటం. దీనివల్ల పిల్లకి మొక్కల పరిచయం అవుతుంది.  కాగా ఆ పత్రిని జాలంలో అంటే చెరువుల్లో కలపటం వలన చెరువులోని నీరు శుద్ధి అవుతుంది.   అంతేకాక ఎక్కువ శ్రాధ వున్న పిల్లలు ప్రీతి పాత్రి ప్రాధాన్యత తెలుసుకొని ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో వైద్యం చేసుకోవచ్చు.  ఎంతో విజ్ఞాన విషయాలను మన పండుగలలో పొందుపరచిన మన ఋషులు సదా ప్రాతః స్మరనీయులే.  
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన పండగలని ఆరోగ్య సూత్రాలతో కలిపి ఆచరించే ఘనత మన పండగలది మన సంప్రదాయాలది.  

వినాయక చవితివ్రత  విధానం 


వినాయక వ్రత విధానం కోసం కేరిండి లింకుని క్లిక్ చేయండి 

http://www.telugunow.com/telugu-audio/vinayaka-chavithi-vratha-kalpam-telugu-28745.html 



తక్కువ ఖర్చుతో అన్నదానం 


మనలో చాలామంది అన్నదానం చేయాలని తాపత్ర పడుతుంటారు.  నిజానికి అన్నదానం అన్నిదానాలకన్నా మేలయినది, ఎందుకంటె అన్నం తిన్న తరువాత ప్రతి వారు తృప్తి చెందుతారు.  కాబట్టి అన్నదానం చేయటం అన్ని విధాల శ్రేష్టమైనది. ఈ రోజులలో భర్త అన్నదానం చేయాలని సంకల్పించినా భార్య సహకరించక పోవచ్చు దానికి అనేక కారణాలు ఉంటాయి.  ఉదాహరణకి ఆరోగ్యం సహకరించక పోవొచ్చు, లేక శ్రీమతి కూడా ఉద్యోగస్తురాలవవచ్చు, లేకమరే ఇతర కారణం ఐనా ఉండొచ్చు.  ఆడవారిని తప్పుపట్ట వద్దు. 

మరి భర్త అన్నదానం చేయాలంటే తాను స్వతగహ వంట చేతగాని వాడవచ్చు.  అధిక దానం వెచ్చించలేకపోవచ్చు.  అలా అనేక కారణాల వల్ల కర్త తన దాన ప్రవృత్తిని వ్యక్త పరచలేక పోవచ్చు.  మనమందరము చూస్తున్నాము మనం ఏదైనా గుడికి కాని గోపురానికి కానీ వెళ్ళినప్పుడు అన్నదానం చేస్తాము మీరు డబ్బులు కట్టండి అని మన దగ్గర రూపాయలు తీసుకుంటుంటారు.  మనం కూడా కేవలం మనం డబ్బులు ఇస్తే వాళ్లే అన్నదానం చేస్తారు కదా అని ఇస్తుంటాము.   ఈ విషయంలో నాకుసరైన అభిప్రాయం లేదు.  ఎందుకంటె మనం డబ్బులు ఇచ్చిన తరువాత ఆ విషయాన్ని మరచి పోతాం.  మన సొమ్ము నిజానికి వినియోగించబడిందా  లేదా అని మనం విచారించాం.  కానీ మనసులో అన్నదానము చేసామన్న భావం కలిగి ఉంటాము. కానీ మనము ఏదైనా ప్రత్యక్షముగా చేసిన దాని తృప్తి ఇంకోలా ఉంటుంది, కాదంటారా. 

మన రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయల భోజన పథకం ప్రెవేశ పెట్టింది.  ఇది నాకు తెలిసి GHMC, రామ కృష్ణ మిషన్ సంయుక్త్ ఆధ్వర్యంలో నడుస్తున్నది.  మన జంట నగరాలలో 50 కేంద్రాలలో (వార్తల ప్రకారం) ఈ భోజన స్టాళ్లు వున్నాయి.  ప్రతి స్టాల్లో మధ్యాన్నం 12 గంటల సమయం నుండి 1 గంట వరకు ఇక్కడ భోజనం పెడతారు.  కేవలం 5 రూపాయలకే 450 గ్రాముల అన్నం,150 గ్రాముల పప్పు, 150 గ్రాముల కూర, ఒక చెంచాడు ఊరగాయ, మరియు ఒక మంచినీటి పొట్లము ఇస్తారు.  సాంబారుకూడా ఉండొచ్చు. నిజానికి ఇది సామాన్యంగా తేనే వారికీ సరిపోతుంది. నేను విచారిస్తే కొంతమంది రెండు భోజనాలు తీసుకుంటే మాకు కడుపు నిండింది అన్నారు.  అంటే 5+5 = 10 రూపాయలు. 


మీరు కేవలం 100 రూపాయలతో 20 మందికి భోజనం పెట్ట వచ్చు.  ఒక్కొక్క స్టాల్లో 60 భోజనాల సదుపాయం ఉంటుంది (ఇప్పటి పరిస్థితి తెలియదు).  అంటే మీరు కేవలం 300 రూపాయల ఖర్చుతో మొత్తం అందరికి భోజనం పెట్టవచ్చు. 


పైన తెలిపిన గణాంకాలు నాకు తెలిసినవి.  ఇప్పుడు మారి ఉండొచ్చు. మీరు స్టాళ్లకి వెళ్లి తెలుసుకోండి. ఈ భోజనం చేసిన వాళ్ళు మంచిగావుందనటమేకాకుండా వాళ్ళ కాళ్ళ నొప్పులు తగ్గాయని చెప్పారు.  నేను విశ్లేషిస్తే నాకు తోచిన విషయాలు.  అక్కడ వినియోగించే బియ్యం ప్రభుత్వ గిడ్డంగులనుండి గ్రహించ బడినవి.  అంటే అవి చాల పాత బియ్యం.  అంతే కాకుండా ఆ బియ్యాన్ని ఎక్కువగా మరపట్టరు. ఎందుకంటె పాలిష్ వేయటం, తెల్లగా చేయటం ప్రభుత్వ పని కాదుగా.  కాబట్టి ఆ బియ్యంలో బి కంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆ అన్నం బలాన్ని మరియి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. 

మన సంపాదనలో కొంత ఈ సమాజానికి అంటే పరులకు ఉపయోగించటం మనుషులుగా మన కనీస భాద్యత.  మీరు చేసే అన్న దానం మీకు మీ కుటుంబానికి శ్రేయెస్సుని కలుగ చేస్తుంది.  మిమ్మలిని అక్కడ భోజనం చేసిన వాళ్ళు దీవిస్తారు.  అది మీకు దేముడి ఇచ్చిన వరం లాంటిదే మానవ భందుత్వాన్ని వివాహసంబంధం తోటి జన్మ సంబందంతోటి ఏర్పాటు చేసుకుంటాం.  నిజానికి కొన్ని సంబంధాలు మనకు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు, అది మనం గమనించాలి.  కొన్ని సందర్భాలలో మనకు అనుకోకుండా కొంతమంది ఎదురవుతారు వారి వల్ల  మనం ఏదో సాయం పొందుతాము  మనం తరచు వారిని  తలచుకుంటాము కూడా నిజానికి అది కేవలం దైవానుగ్రము మాత్రమే.  దేవానాం మనుష్యరూపేణ అంటే భగవంతుడు మనకు ఏమైనా శ్రేయస్సు చేయదలుచుకుంటే అది కేవలం మన తోటి మనిషి తోటే చేస్తాడు అని అర్ధం.    మనల్ని కూడా యితరులు తలుచుకోవాలంటే యితరులకు ఎంతో కొంత సాయం చేయటం చాల మంచిది.   అన్న దానం చేయండి సాటివారికి సాయపడండి. 
కొంతమంది తమ లేక తమ కుటుంబ సభ్యుల జన్మ దినానికో లేక వారు మారె యేతర ముఖ్యమైన రోజునో తరచు అన్న దానం చేయటం మనం చూస్తున్నాము.  వారికీ ఇచ్చే సలహా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వ 5 రూపాయల భోజన పథకం ద్వారా అన్న దానం చేయండి.  మీరే అన్నదానం చేసిన  తృప్తిని పొందండి. అన్న దానాన్ని ప్రోత్సహించండి. మన చేతనైనంతగా అన్నార్తులని ఆడుకుందామన్న తృప్తి పొందుదాము. 
ఒక సంఘటన: 
ఒకరోజు హైదరాబాద్ సివిల్ కోర్టు ఆవరణలో కొంతమందికి నేను ఫై స్టాల్లో అన్న వితరణ చేస్తుండగా ఒక మహిళ పాపం చంటి పాపను ఎత్తుకొని వచ్చింది.  ఆమె కృతజ్ఞతా భావంతో చూసిన చూపులు ఇంకా నాకు జ్ఞపకం వుంది.  
అన్న దానం అన్నది ఒక ఉద్యమంగా మారాలి.  ప్రీతి అన్నార్తి కడుపు నిండాలి అన్నదే ఈ బ్లాగర్ కోరిక.  ఈ యజ్ఞంలో ప్రీతి ఒక్కరు భాగస్వాములు కావాలి.  అన్నార్తులు అస్సలు ఉండకూడదు. 
ది !! 25-9-2018  నాటి అన్నదానం 
ఈ రోజు మేము ఐదుగురం అనగా 1) సర్వ శ్రీ నాగ శ్రీనివాస్ 2) శ్రీనివాసన్, 3) ఇక్బాల్ అలీఖాన్ 4) టి. పరిపూర్ణా చారి, 5) సి. భార్గవ శర్మలు కలిసి ఒక్కోక్కరం నూరు రూపాయల వంతున ఖర్చు పెట్టి మొత్తం వంద ప్లేట్ల 5 రూపాయల భోజనాన్ని కొని వితరణ చేయటం జరిగింది.  మిత్రులు మహాలింగం, సురేష్ గార్లు మాకు సహకారాన్ని అందించారు.  మిత్రులు ఒకరు ఈ భోజనానికి అనుబంధంగా స్వీట్స్, మజ్జిగ సరఫరా చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు.  భవిష్యత్తులో చేసే అన్న దానంలో వాటిని పరిశీలిద్దామని మేము అనుకున్నాము.  భోజనం చేసిన వారు కొందరు వారు కూడా ఈ అన్న దాన కార్యక్రమంలో పాలు పంచుకుంటామని తెలిపారు.  ఇది చాల సంతోషకరమైన విషయం.  ఈరోజు వితరణ చేసిన భోజనంలో ఆలుగడ్డ కూర, సాంబారు, మామిడికాయ ఊరగాయ, మంచినీటి పొట్లము ఉన్నాయి. భోజనం సరిపడని వారు రెండు ప్లేట్లు కావాలని అడిగారు, వారికి రెండుప్లేట్ల భోజనం అందించటం జరిగింది. కార్యక్రమమం తృప్తిని ఇచ్చింది. 
"ఋణాను బంధ రూపేణా పశు పత్ని సుతాలయ "
ప్రతి జీవి తాను గతంలో చేసుకున్న కర్మల బట్టి పాప పుణ్యాలు కలుగుతాయి. పుణ్యం అంటే మన లెక్కలో క్రెడిట్ పాపం అంటే డెబిట్ అన్న మాట. నిజానికి ఏది మనకు కనిపించదు.  కానీ మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులనుబట్టి వాటిని అనుభవిస్తాము.  పాప పుణ్యాల బ్యాలన్సుషీట్ సమానంఅయితే అంటే పాపం=0, పుణ్యం=0 అయితే ఆ జీవి మొక్షాన్ని పొందుతుంది.  అదే కైవల్యం అంటే జన్మ రాహిత్యం.  
ప్రతి జీవి తాను మొదటి సరిగా జన్మ ఎత్తి నప్పుడు పాప పుణ్య రహితుడు గా ఉంటాడు.తాను చేసిన కర్మలను బట్టి తాను పాపా పుణ్యాలను పొందుతాడు.  మన పూర్వ జన్మ పాప పుణ్యాల జాబితా బట్టి మనకు జన్మ కలుగు తుంది.  మన హిందూ ధర్మం ప్రకారం పాప పుణ్యాల గుణిక బట్టి జన్మ కలుగుతుంది.  అంటే జంతుజాలం, కానీ వృక్ష జాలం కాని,  ఎక్కువ పుణ్యం ఉంటేనే మానవ జన్మ కలుగుతుంది.  అంటే జీవజాలంలో అన్నిటికన్నా ప్రముఖమైనది మహోన్నతమైనది మానవ జన్మ.  కాబట్టి మానవ జన్మను సార్ధక్యము చేసుకోవటం ప్రతి మనిషి భాద్యత ఈ జన్మలో మాత్రమే తెలివి తేటలు, మాట్లాడతాము మన భావాలను యితరులకు తెలియ చేయ సామర్థ్యం ఉంటుంది.  అందుకే మన ఆలోచనలు సదా అభివృద్ధి కరంగాను ఇతరులకు యుపయోగ పడేవిధం గాను సమాజ శ్రేయెస్సును కోరే విధంగానూ ఉండాలి.  ప్రతి వారు మనలను, మన మంచితనాన్ని గుర్తించే విధంగా ఉండాలి. 
ఇంకా వుంది. 

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచై:
ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యా:
విఘ్నై: ముహుర్ముహరపి ప్రతిహన్య మానా:
ప్రారబ్ధం ఉత్తమ జనా:న పరిత్యజంతి ---  
భర్తృహరి సుభాషితం 


తెలుగులో 
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై 
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ 
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై 
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ -

----ఏనుగు లక్ష్మణ కవి. 

మొదలు పెట్టరు ఏ కార్యమును సోమరులు 
మొదలు పెట్టి మధ్యలో ఆపుదురు అస్థిమిత పరులు 
ఎన్ని కష్టములేదురైనను తా తలచిన పని పరిపూర్ణము చేదురు 
ధీరులైన మానవులు లాభాపేక్ష లేకనే భార్గవ 

ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. 



కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా న స్నానం న విలేపనం నాలంకృతా మూర్ధజా:
వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే ఖలు భూషణాని సతతం
వాక్ భూషణం భూషణం ---- 
భర్తృహరి సుభాషితం 


ఒకచో నేలను బవళించును నొకచో నొప్పారు భూసెజ్జపై 
నొకచో శాకములారగించు నొకచో నుతృష్టశాల్యోదనఁ 
బొకచో బొంత ధరించు నాక్కొక్కతరిన్ యోగాయంబర శ్రేణి, లే 
క్కకు రానీడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ 
 ---- భర్తృహరి సుభాషితం 

పరుండుటకు పాన్పు నేతకడు దుస్తులలో అందము చూడడు 
తిండిలో రుచుల కెగబ్రాకాడు  ఉన్నదానితో సరిపెట్టుకొనును 
కానీ తన పనిలోని లగ్నతను మాత్రము వీడడు 
కార్య సాధకుడు సుఖ ధుఃఖఃముల తలపడు  మది భార్గవ 


ఒకతేకు జగములు వణుకున్ 
ఆగదితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ 
ముగ్గురండ్రు కల్సిన సుగుణాకరా 
పట్టా పగలే చుక్కలు రాలున్


 కవిలోకం 
అతడొక 
నలిగిపోయిన రూపాయి నోటులా కనబడతాడు 
పుస్తకం హస్త భూషణం అంటారేమో 
అతడికి అది కవచ కుండలం 
అదిలేనిదే అతడి రూపాన్ని ఊహించలేము 

నగరంలో ఏ సమావేశమైన 
అతడు కనపడనిదే పూర్తికాదు 
ఒకేసారి ఇంద్రజిత్తుల 
అన్ని సమావేశాలలో కనబడతాడు.

ఫెళ ఫెళలాడే కొత్త నోటులా ప్రవేశిస్తాడు 
విద్యుద్దీపాలతో ధగ ధగలాడే వేదికలు 
అతడి ఠీవి ముందు వెల వెల పోతాయి 

సమావేశం ముగియగానే 
దీపాలు ఆర్పేసిన వేదికలాగానే
అతడుకూడా చెల్లని నోటులాగా మారిపోతాడు 

కాళ్లీడ్చుకుంటూ బస్టాండుకు చేరుతాడు 
రాత్రి ప్రయాణం ,దూరాభారం 
అతడి వయస్సును గుర్తు తెస్తుంది 

దిగాలుపడిన చూపులతో 
బస్సు కోసం ఎదురు చూస్తూ 
కొత్త కవిత్వాన్ని రాస్తున్నట్లుంటాడు.

                      -సత్యభాస్కర్ ,9848391638
బాల్యం మనోవేగం
ఆకాశంలో విహరించిన కల

యవ్వనం,శారీరక బలం 
కలల వెంట పరుగెత్తిన కాలం

నడిమిటి లో,సాగదీసిన ఆలోచన 
కదలని కాళ్ళు,సహకరించని ఒళ్ళు 
జీవితం వలలో చిక్కిన సమయం!

వార్ధక్యం,ఒక తాత్విక సమాలోచన
తెగిన సంకెళ్ళు,తెగిపడ్డ కలలు!!
           ***

        -సత్య భాస్కర్

 ఓటు వజ్రాయుధమా!?
   బడిలో పిల్లవాడినాడుగు 
   పగలబడి నవ్వుతాడు
   ప్రలోభాల పద్మవ్యూహంలో 
   చిక్కుకున్న ఓటు
  కుల మత ప్రాంతాల 
  మత్తెక్కిన ఓటు
  ఆధిపత్యం ముందు 
   అణగారిన ఓటు
  ఓటర్ చేతినుండి 
  ఏనాడో పోయింది!

ఎన్నికలు కోటీశ్వరులు ఆడే
మాయ జూదం అయిపోయాయి 
తర తరాలు పట్టి పీడించిన 
రాజుల పాలన ఆధునిక హంగులతో
తిరిగి అధికారం చేపట్టింది 
ఓట్ల క్రయ విక్రయాలు 
హోల్ సేల్ వ్యాపారమయిపోయింది 
ప్రజాస్వామ్యం ఏనాడో పార్లమెంట్లో
వస్త్రాపహరణకు గురయింది
ఓటర్లు రిమోటుతో నడిచే
రోబోలయిపోయారు!
   *****
                 satyabhaskar 
                9848391638  

   కాలజ్ఞానం


కాలంతో

పోటీపడకు
అది అజేయం!

వర్తమానం

నీ చేతిలో అవకాశం
గతం గతః

భవిష్యత్తు

గాలిలో దీపం!

కాలం

నీ కోసం

ప్రతి రోజు

ఒక కొత్త పేజీ
తెరుస్తుంది!

కాలపరీక్షకు
జవాబు రాయి
పక్కవాడి పేజీలో
చూడబోకు
నిర్లక్ష్యం గా
తిప్పేయబోకు
అటు,ఇటు చూస్తూ
కాలం గడపకు!
 క్షణంలో
నీ జీవితం
చేజారిపోతుందో తెలియదు
అది కాలమే నిర్ణయిస్తుంది!
కాలరేఖల  మీద
నువ్వు చూస్తుండగానే
నీ జీవితం ముగిసి పోతుంది!

        ######
సత్యభాస్కర్,9848391638
 



తిమిరంతో పయనం 

కోటి రతనాల వీణ 
తెగిన తంత్రులతో వికృత రాగాలాలపిస్తోంది.
సమసమాజ భారతికి దారులు వేసిన నేల
విప్లవోద్యమాల పురిటిగడ్డ 
అభ్యుదయ భావజ్వాల 
నేడు మరుభూమిగా మారిపోయింది!

తిరిగొచ్చిన గడీల పాలన
పల్లె పల్లెలో ఫ్యూడల్ భావజాలాన్ని 
పునఃప్రతిష్ఠ చేస్తోంది .

కులం మతం కవల రాక్షసుల్లా 
జనాలను కబళిస్తున్నాయి !

కన్నబిడ్డలనే తెగనరుక్కునే కసాయితనం
నుదిటికుంకుమ చెరిపేసి రాక్షసత్వం 
తలకెక్కిన కులోన్మాదం వికట్టహాసం చేస్తోంది!

అమరుల నెత్తుటితో తడిసిన నేలలో
కుక్కమూతి పిందెలు,పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి.

అంధకారం ఆక్రమించుకుంటున్న నేల 

తిరోగమం లో పురోగమిస్తోంది!

                             ---సత్య భాస్కర్ 



మీనింగ్ లెస్
కాలం కరిగిపోతోంది 
పరస్పర అభివాదాలతో 
అప్రకటిత యుధ్ధాలతో
ఎత్తులు పై ఎత్తులతో 
మౌన ఒడంబడికలతో 
అపార్ధాలతో,అనుమానాలతో
అనవసర వాగ్వివాదాలతో!

అంతరంగం,నిత్య కల్లోలిత ప్రాంతం 
భావ వ్యక్తీకరణకు అన్ని అడ్డంకులే 
అర్ధం కాని దాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం 
దొరకానిదానికోసం వెదుకులాట 
అర్ధం అయినదాన్ని,అరచేతిలో ఉన్నదాన్ని
దొరికినదాన్ని పారవేసేదాకా నిద్ర పట్టదు!

కళ్ళ ముందే సాగుతోన్న జనన మరణాలు 
నిన్నటిదాకా మనతో వున్నవాడు 
జరిగిపోయాడని, ఎగిరిపోయాడని
ఇప్పుడే అందిన వార్త 
అయినా మనం శాశ్వతం 
అన్నంత భ్రమలో,ఒక ఝరిలో 
మన రోజువారీ జీవితం!

అర్ధం లేని జీవితాన్ని గడపడం
మనతో మనం ఆడుతోన్న 
ఒక క్రూర పరిహాసం!
     *****
                       -సత్యభాస్కర్, 9848391638 
పలకరింపులు
శుభోదయం,శుభరాత్రులను
మీ నుండి నేనాశించడం లేదు !
రెండు వేళ్ళు నెప్పెట్టేలా
నన్నే పలకరించనివ్వండి !
మీ పేర్లు చూడగానే
మీ రూపాలు జ్ఞాపకం వస్తాయి
మీతో గడిపిన క్షణాలు
దొర్లించిన మాటలు కళ్ళముందుకదలాడతాయి !
కాలప్రవాహంలో అనివార్యంగా
మీకంటే ముందుకు వెళ్ళిపోయాను
లేకుంటే మీతోపాటే ఆలా
నిశ్చల చిత్రమయి పోవాలని
ఎన్ని రాత్రిళ్ళు పలవరించానో!
ఏనాడో తప్పిపోయిన నా స్నేహితుడు
ముఖపుస్తకంలో కనపడ్డప్పుడు
ఎంత పరవశం చెందానో!
తీరా పలకరించే సరికి
అంతస్తులు అడ్డం వచ్చాయి
సుదూర తీరాలలో ,విదేశాలలో
భోగ భాగ్యాలలో తులతూగుతున్నవాడికి
కుచేలుడిలాంటి నాలాంటివాడు
ఎలా గుర్తుకువస్తాడు!?
అందరు కృష్ణులు కాదుకదా!
మీ వేగంతో,గమ్యంతో
నాకు పేచీ లేదు
ఎదో ఒకనాడు
'అల్విదా 'చెప్పకుండానే
నా పలకరింపులు ఆగిపోతాయి
అప్పటిదాకా అవకాశం ఇవ్వండి!!
(వాట్సాప్  లో రోజు గుడ్మార్కింగ్ పెట్టవద్దనివిసుక్కోవడం చూసి)
-సత్యభాస్కర్

 మౌనమే నీ భాష..

 (Dt:26-9-2018)

రెండు శబ్దాల మధ్య 
నిశ్శబ్దాన్ని సేకరిస్తున్నా
నిశీధి రాత్రి వేళ
ఆకాశం ఇచ్చే 
పున్నమి సందేశాన్ని 
వినాలని ప్రయత్నిస్తున్నా
పర్వతాలు గాలితో చేసే
సంభాషణను 
సముద్రుడు కెరటాలతో 
చేసే సవ్వడిని 
అగ్ని ధారను
అర్ధం చేసుకోవాలని 
మౌన భాష నేర్చుకుంటున్నా
ఆమ్మ ఒడిలో 
పసిబాలుడిలా 
ప్రకృతిలో ఒరిగిపోవాలని
తపిస్తున్నా!!
                    -సత్యభాస్కర్,9848391638 

తల్లితండ్రులమీద  దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమ

మనం చిన్నప్పడినుంచి పిల్లలకి శతక పద్యాలు  వల్లే వేస్తే ఈ నాటి దుర్భర పరిస్థితి కొంత తగ్గుతుంది.  ప్రస్తుతం మనం భారత దేశంలో వున్నా మనలని ఏలుతున్నది ఇంగ్లీష్ మరియు పాశ్చాశ్చ సంస్కృతి.   దాని ప్రభావం తో పిల్లలలో కుటుంబ సంబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు రోజూ రోజుకి తగ్గి  పోతున్నాయి. దాని వల్ల తల్లి దండ్రుల విలువలు తెలియటం లేదు.  చిన్నప్పటినుంచే పిల్లలకి తల్లిదండ్రులను గౌరవించటం నేర్పించటం మన కనీస ధర్మం. ఎప్పుడైతే ఒక వ్వక్తి " మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిధి దేవోభవ" అని తెలుసుకొని నడుచుకుంటాడో ఈ సమాజం పూర్తిగా ప్రేమ మయంగా అవుతుంది అందరు సంతోషాలతో వుంటారు. తల్లికి అన్నము పెట్టని కొడుకులని మనం రోజు ఎంతో మందిని చూస్తున్నాము.  తల్లి దండ్రుల విలువలు తెలుసుకున్న మనిషి ఎవ్వరు వాళ్ళని చులకనగా చూడడు. వృధాశ్రమాలకు పంపించడు.  ఈ రోజుల్లో మనం అనేక భాంధావ్యాల మధ్య వివేదాలు చూస్తున్నాము. తల్లి తండ్రులను ఎదిరించెడు పిల్లలు అంతేకాదు వారిని పూచిక పుల్లతో సమానంగా చేసి ప్రవర్తించే వాళ్ళని చూస్తున్నాము. ఇటీవల కాలంలో తల్లి తండ్రులను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకునే వారిని చూస్తున్నాము.  వారందరు వారు చేస్తున్న పని వాళ్ళ తల్లి తండ్రులను భాదిస్తుంది అని తలవటంలేదు అంతేకాదు వారు చేసుకున్న పెండ్లి కుడా ఎక్కువ కలం నిలవటం లేదు.  ఫామిలీ కోర్టులలో వున్న విడాకుల కేసులలో చాలావరకు ప్రేమ పెండ్లి కేసులే.  మన కుటుంబవ్యవస్త విదేశీ పోకడలతో నానాటికి చిన్నా బిన్నం ఐపోతున్నది విదేశీయులు మన సంప్రదాయాలపై శ్రద్ధ చూపెడుతూ కుటుంబ వ్యవస్తకోసం ప్రాకులాడుతుంటే మన వారు ఆచారాలను, సంప్రదాయాలను వదిలివేసి ఎవరికి వారు విచ్చలి విడిగా తిరగటానికి అలవాటు పడుతున్నారు.  దీని పర్యవసానమే మనం రోజూ చూస్తున్న అనేక అరాచకాలు.  ఎప్పుడైతే ప్రతివక్కరు కుటుంబ సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారో వారి కుటుంబమే కాదు పూర్తి సమాజం ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది.  ఈ విషయాన్నీ ప్రస్తుత యువత గమనించాలి.  పూర్వం మన ఇండ్లలో "పెద్ద తలకాయ లేకపోతే గొర్రె తలకాయ  తెచ్చుకోండి" అనేవారు.  అంటే ఇంటికి పెద్దవారు ఉండాలి వారి వల్ల కుటుంబ ఆచారాలు పాటించాలి అని అర్ధం పెద్దవారు   లేకపోతే ఒక మెదడు  లేని  గొర్రెలాగా ఆ కుటుంబం అనాలోచితంగా ఉంటుంది అని.  

పూర్వం ఒక పెండ్లి చేయాలంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు  చూడాలని అనేవారు.  దాని భావం  ఆ ఇరు కుటుంబాల ఆచార, సాంప్రదాయాలు ఒకే మాదిరిగా ఉంటె ఆ దంపతులు సుఖంగా కలకాలం వుంటారు అని.  ప్రేమ వివాహాలు ఎక్కడో కానీ విజయవంతం కావు.  చాల వరకు విడాకులకు దారి తీస్తున్నాయి. తల్లిదండ్రులని ఎదిరించి పెండ్లి చేసుకుంటే వాళ్ళు వప్పుకుంటారో లేదో అనేది ఒక ప్రశ్న వారు ఒప్పుకోక పోతే ఈ కొత్త జంట సమాజంలో వంటరిది అవుతుంది.  వారి మధ్య ఏమైనా స్పర్ధలు వస్తే సర్ది చెప్పటానికి పెద్ద వాళ్ళు రారు.   వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా అవుతుంది.  చిన్న చిన్న సమస్యలు కూడా విడాకులకి దారితీస్తాయ. రోజు రోజుకి ఫ్యామిలి కోర్టుల్లో విడాకులకేసులు పెరుగుతున్నాయి కారణం ఏమైనా ఒక్కటి మాత్రం నిజం మన సమాజంలో అన్ని రకాల జీవన స్థాయిల్లో వివాహాలు విడాకులవైపు దారి తీస్తున్నాయి.  ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి   వివాహావ్యవస్థని పటిష్టం చేయాల్సిన అవసరం వుంది.    మన వివాహ వ్యవస్త రెండు కుటుంబాలని కలిపేది కానీ ఇద్దరు వ్యక్తులిని మాత్రమే కలిపేది కాదు ఇది ప్రతి వక్కరు తెలుసుకొని నడుచుకుంటే అందరు ఆనందంగా వుంటారు.   మీడియాకు వార్తలు వుండవు.  
సర్వే జానా సుఖినోభవంతు !!!! 

ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !
ఎలా ఇతరులతో ప్రవర్తించాలో చెపుతున్నాడు శతకకారుడు 
మాట్లాడటం ఒక కళ అలానే మాట్లాడకుండా వుండటము ఒక కళ ఎందుకంటె కొన్ని సందర్భాలలో మనం తెలియకుండానే ఎక్కువగా మాట్లాడి యితరుల మనస్సు నొప్పిస్తాము. నిజానికి మనకు ఎదుటివాడికి మనస్సు నొప్పించాలని ఉండదు.  అందుకే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు తెలుసుకోవలసిన విషయం మాటలని అదుపులో ఉంచుకోవటం. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం చాల మంచిది.  కానీ మాట్లాడ వలసిన సందర్భాలలో మౌనంగా ఉంటే అనేక అపార్ధాలకి దారితీస్తాయి, అంతేకాదు కొన్ని నష్టాలు కూడా జరగ వచ్చు.  ఉదాహరణకి ఒక వ్యాపారస్తుడు కొనుగోలు దారు బ్యారం చేస్తే తనకి గిట్టుపాటు కానీ సందర్భంలో మాట్లాడకుండా ఉంటే ఆ కొనుగోలుదారు తనకు తక్కువ ద్రవ్యం ఇచ్చి తీసుకొని వెళతాడు అంతే కాదు ప్రతి విషయం కూడా అలానే ఉంటుంది. ఆదే కొన్ని వేళలలో మాట్లాడటం వలన మేలు జరుగుతుంది. సందర్భానుసారంగా ప్రవర్తించటం మంచిది.  ముఖ్యంగా వ్యాపారస్తులు, న్యాయవాదులు ఈ విషయములో జాగ్రత్త వహించవలసి ఉంటుంది.  

మనుషులు 



అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ... 
ఇప్పటికీ అర్ధం కాదు...పనిచేయటానికి బ్రతుకుతున్నానా? లేక బ్రతకటానికి పని చేస్తున్నానా అని  ??
 బాల్యం లో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...
పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని? 
ఆఁ... సమాధానం ఇప్పుడు దొరికింది ...
మళ్ళీ బాల్యం కావాలని... మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని.... ...............
మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది...
వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని....
ఔను... లోకం లాజిక్కుని  చూపింది వాళ్ళే మరి..........
 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే...
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది...
నా విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని...
నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని...............
 నవ్వాలని అనిపించినా ... నవ్వలేని  పరిస్థితి...
ఎలా వున్నవని ఎవ్వరైనా అడిగి నప్పుడు ---
ఓహ్ ..నాకేం  బ్రహ్మాండంగా వున్నా... అని అనక తప్పనప్పుడు. ...
ఏడవాలన్నా  ఏడవలేని పరిస్థితి.. 
వాడికేందిరా.. దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు...
ఇది జీవిత నాటకం... ఇక్కడ అందరూ నటులే... నటించక తప్పదు....
అవార్డుల కోసం కాదు... బ్రతకటం కోసం..., 
కాదు.. కాదు.. బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.
రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....
ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ... 
ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...
సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట.... 
బాహ్య లోకం లో జీవం ఉందా లేదా అని....
మరి... జీవితం  లో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!
ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం పెరిగుతుందని ఆందోళన ...
ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...
పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు .. కర్కశత్వం కూడా...
మట్టిలో మొక్కలు నాటాలి.. మనసులో మానవత్వం నాటాలి...
ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి.... 
మళ్ళీ.. ఒక్క క్షణం... నాకెందుకులే అని... 
సమస్య నా ఒక్కడిదే కాదుగా అని...
నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి....
పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు....
నా పని.. నా ఇల్లు.. నా పిల్లలు.. నా...నా.. నా... తోనే నలిగిపోతున్నా... 
ప్రక్కవాన్ని నిందిస్తూ రోజు గడిపేస్తున్నా...
జీవితమన్నది తనంత తానుగా నడచి పోతుంది…. గడచి పోతుంది.... 
మనకళ్ళముందే..... మనకు తెలియకుండానే ముగిసిపోతుంది. 
చేయడానికి చాలా టైం వుందని, చావు దగ్గరకోచ్చేదాకా చోద్యం చూస్తున్నా....
చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో నడిచిపోతున్నా.... కనుమరుగౌతున్నా...
ఎవరినో అడిగాను ..అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?
ఎవరో మహానుభావుడు ఎంతో  అందంగా సేలవిచ్చాడు !!!
నిద్ర, సగం మృత్యువట! మరి మృత్యువు, ఆఖరి నిద్రట!!!
అసలు ప్రశాంతంగా నిద్రించి ఎన్నేళ్ళయ్యిందో.. ఎదో ఒకనిద్ర ఆవహిస్తే అదే వరం.
ఆనందం లేని అందం.. జవాబు లేని జీవితం.... ప్లాస్టిక్ పరిమళం.. సెల్ ఫోను సోయగం...
ఇది నా నాగరిక జీవనం.   తెల్లారి పోతున్నది...  రోజుమారుతున్నది..
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....
ఏంటో!! జీవితం రైలు బండి  లా తయారయింది...
ప్రయాణం ఐతే ప్రతి దినం చెయ్యాలి... చేరే గమ్యం మాత్రం లేనే లేదు........
ఒకడు శాసించి  ఆనందిస్తాడు ... మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు ...
ఒక రూపాయి విలువ తక్కువే....
కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....
 అది లక్ష ఎప్పటికీ కాదు... ఆ లక్ష సంపూర్ణం కాదు... 
అందుకే...  *మనిషి*  ఆనందం,సంతోషం కోసం బతకండి.అప్పుడే నిజమైన మనుషులు  అవుతారు.....
                                                         .... రమణమూర్తి 

హైదరాబాద్ మెట్రో రైల్ మార్గం క్రింద చూడవచ్చు 

Hyderabad Metro Rail Route MAP
కోదండ రామాలయం అమ్మపల్లి 
అమ్మపల్లి లోని కోదండ రామాలయము 11 ఫే శతాబ్దానికి చెందినది ఇది హైదరాబాదుకి సమీపములో వున్న శంషాబాద్ కు 6 కిలోమీటర్ల దూరంలో వున్నా ప్రాచీన దేవాలయం. హైద్రాబాదు నుండి సిటీ బస్సులో శంషాబాదుకు వెళ్లి అక్కడినుండి వికారాబాదుకి వెళ్లే బస్సు కానీ లేక అక్కడ వున్నా షేరింగ్ ఆటోలోకాని ఈ దేవాలయానికి చేరుకో వచ్చు.  బస్సు ఛార్జి 6రూపాయలు ఆటో అయితే 10 రూపాయలు.  మీరు ఈ దేవాలయానికి వెళ్లాలంటే రోజులో ఏ సమయంలో నైనా వెళ్లి స్వామి దర్శనం చేసుకోవచ్చు.  మధ్యాన్నం 1గంట నుండి 230 వరకు దేవాలయం ముస్తారు.  కానీ ఈ సమయంలో కూడా మీరు వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చు కారణం గర్భగుడి తలుపులు గ్రిల్ తలుపు మాత్రమే ముస్తారు.  9 ఎకరాల విశాల ప్రాంగణంలో కట్టిన దేవాలయం. రూ. 10 కి లడ్డు, పులిహోర ప్రసాదం లభిస్తుంది.  జనం మాములు రోజులలో విరివిగా రారు కాబట్టి ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవచ్చు.  ఈ దేవాలయాన్ని చుసిన వాళ్ళు అక్కడే వున్నా శివాలయానికి కూడా వెళ్ళవచ్చు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక కోనేరు వున్నది.  దీనికి వెళ్ళటానికి ఒక వేపు నుండి మాత్రం మెట్లు వున్నాయి క్రింద స్నానం చేసిన వాళ్ళు దుస్తులు మార్చుకోవటానికి మధ్య భాగంలో గదులు వున్నాయి.  కానీ కోనేరులో నీళ్లు లేవు.  కేవలం చూసి రావచ్చు. క్రిందతలం దాకా మెట్ల నుండి దిగవచ్చు. 
________________________________________________________________________________________________________________________________________________________________

Links





No comments:

Post a Comment